Movie News

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సినిమా మొదలయ్యే సమయానికి ఇండియాలో ఏ సినిమా బడ్జెట్ కనీసం వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోలేదు. అలాంటిది 4 వేల కోట్ల బడ్జెట్ ఏంటి అని అంతా విస్తుబోయారు. ఆ బడ్జెట్ అంచనా విన్నాక ఈ సినిమా గురించి చాలా ఊహించుకున్నారు.

కానీ దీపావళి కానుకగా విడుదల కానున్న ‘రామాయణం: పార్ట్-1’కు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోలైతే అంచనాలను అందుకోలేకపోయాయి. పోనీ కనీసం ప్రమోషన్లయినా గట్టిగా చేస్తున్నారా అంటే అదీ లేదు. ‘రామాయణం’ విడుదలకు ఇంకో మూడు వారాల సమయమే ఉన్నా సరే.. ఇప్పటికీ ప్రమోషన్లు ఊపందుకోవడం లేదు. రిలీజ్ ముంగిట టీం ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నమే చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రామాయణం ఆధారంగానే తెరకెక్కిన ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ఆదిపురుష్’కే ‘రామాయణం’ కంటే రిలీజ్ ముంగిట ఎక్కువ హైప్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐతే ట్రైలర్‌ బెటర్‌గా ఉండడం, టీం గట్టిగా ప్రమోషన్లు చేయడం ద్వారా ఆ నెగెటివిటీని దాటుకుని రిలీజ్ టైంకి హైప్ తెచ్చుకోగలిగింది. ఐతే రిలీజ్ తర్వాత మళ్లీ ట్రోల్స్ తప్పలేదు. సినిమా డిజాస్టర్ అయింది. ఐతే ఆ సినిమా ప్రి రిలీజ్ హైప్ వల్ల భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగింది.

కానీ ఇప్పుడు ‘రామాయణం’ పరిస్థితి చూస్తే.. ‘ఆదిపురుష్’ స్థాయి హైప్ కూడా కనిపించడం లేదు. ఈ సినిమా గ్లోబల్ రైట్స్ సోనీ పిక్చర్స్‌కు కేటాయించిన మేకర్స్.. ఇంటర్నేషనల్ ప్రమోషనల్ బడ్జెట్టే వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అంత ఖర్చు పెట్టి ఏం ప్రమోట్ చేస్తున్నారో కానీ.. ఇటు ఇండియాలో, అటు విదేశాల్లో ఈ సినిమా గురించి సౌండ్ అయితే వినిపించడం లేదు. ఇంత ఖర్చు పెట్టి భారీ సినిమా తీసి.. ప్రమోషన్ల విషయంలో ఇదేం స్ట్రాటజీనో అని ఆశ్చర్యపోతున్నారందరూ. రిలీజ్ ముంగిట అయినా హైప్ పెంచే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

This post was last modified on October 12, 2026 12:09 pm

Share

Recent Posts

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

28 minutes ago

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

1 hour ago

డ్యూడ్ హీరో… మోదీనే పొమ్మన్నాడుగా

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…

1 hour ago

అందరికీ అది… రాజమౌళికి మాత్రం ఇదే

రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…

1 hour ago

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

2 hours ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

3 hours ago