సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆయన సొంతం. చాలా సందర్భాల్లో రజినీ సినిమా రిలీజవుతోందంటే.. పోటీగా తెలుగు సినిమాలను దించడానికి భయపడ్డారు. ఆయనకు సోలో రిలీజే దక్కుతుంటుంది.
కాకపోతే ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి ‘జైలర్-2’కు పోటీగా ‘రణబాలి’తో పాటు రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. తెలుగు సినిమాలు నార్మల్ రేట్లతో రిలీజవుతుంటే.. ‘జైలర్-2’కు మాత్రం ఏపీలో టికెట్ల ధరలు పెంచారు. దీని మీద కొంచెం గట్టిగానే విమర్శలు కూడా వచ్చాయి. ఐతే డబ్బింగ్ సినిమాకు ఇలా రేట్లు తెచ్చుకోగలిగారు కానీ.. ఈ సినిమా ప్రమోషన్లకు రజినీని మాత్రం రప్పించలేకపోయారు.
‘జైలర్-2’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ హాజరు కావడం లేదని సమాచారం. ఈ సినిమాకు తమిళంలో భారీ స్థాయిలో ఆడియో వేడుక నిర్వహించారు. రజినీ తన సినిమాలను తెలుగులో ప్రమోట్ చేయడం తక్కువే. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇక్కడికి వస్తారు. సూర్య, కార్తి లాంటి వాళ్లు మాత్రం తమ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు వస్తారు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. కానీ రజినీకి మాత్రం ఇక్కడ తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నప్పటికీ ఆయన ప్రమోషన్లకు రావడం తక్కువే.
మిగతా సందర్భాల్లో ఏమో కానీ.. పోటీలో ఉన్న మిగతా సినిమాలకు కాకుండా, ‘జైలర్-2’కు మాత్రమే ఏపీలో టికెట్ల ధరలు పెంచినందుకు విమర్శలు వస్తున్న ఈ సమయంలో అయినా ఆయన్ని ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రప్పించే ప్రయత్నం చేయాల్సింది. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీ ఆ పని చేయలేకపోయారు. ‘జైలర్’ లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ అయినప్పటికీ.. ఒక మోస్తరు బజ్‌తో రిలీజవుతున్న ‘జైలర్-2’ తెలుగులో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 12, 2026 12:36 pm
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…
2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం…
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…