Political News

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ కుబేరుడు, ఎక్స్ అధిప‌తి ఎలాన్ మ‌స్క్.. ఇటు భార‌త ప్ర‌భుత్వంపైనా.. అటు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, జియో అధిప‌తి ముఖేష్ అంబానీపైనా చేస్తున్న విమ‌ర్శ‌లు. భారీ స్థాయిలో మ‌స్క్ త‌న వ్యాఖ్య‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. భార‌త ప్ర‌ధాని ముఖేష్ అంబానీ గారూ.. అంటూ వ్యంగ్యాస్త్రాలుకూడా సంధించారు. ఇక‌, దేశంలో గుత్తాధిప‌త్యం కొన‌సాగుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అస‌లు వివాదం ఏంటి? మ‌స్క్‌కు ఎందుకు కోపం వ‌చ్చింది? అనే విష‌యాలు కీల‌కంగా మారాయి.

దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించ‌డంలో ప్ర‌స్తుతం జియో, ఎయిర్‌టెల్‌.. వంటివి కీల‌కంగా ఉన్నాయి. వీటి ద్వారానే మొబైల్ డేటా నుంచి ఇంట్లో వినియోగించుకునే ఇంట‌ర్నెట్ వ‌ర‌కు దాదాపు 80 శాతం వ‌ర‌కు అందుతున్నాయి. అయితే.. తాము కూడా భార‌త్ లో ఇంట‌ర్నెట్ సేవ‌లు అందిస్తామంటూ.. మ‌స్క్ ముందుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు చెందిన స్టార్ లింక్‌ శాటిలైట్ సేవ‌ల‌ను భార‌త్‌లో ప్రారంభించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ.. నాలుగు మాసాల కింద‌టే కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీనికి కేంద్రం నుంచి ఎలాంటి స‌మాధానం లేదు.

ఈ నేప‌థ్యంలో అతి పెద్ద ఇంట‌ర్నెట్ వినియోగ దేశంగా ఉన్న భార‌త్‌లో త‌న వ్యాపారాల‌ను ముఖేష్ అంబానీ(జియో అధిప‌తి) అడ్డుకుం టున్నార‌న్న‌ది మ‌స్క్ ఆరోప‌ణ‌. ఆ కార‌ణంగానే త‌న ద‌ర‌ఖాస్తుకు మోక్షం ల‌భించ‌డం లేద‌న్న‌ది ఆయ‌న భావ‌న‌. ఈ క్ర‌మంలోనే తాజాగా గ‌త రెండు రోజులుగా మస్క్ చేస్తున్న‌ సంచలన వ్యాఖ్యలు.. స్టార్‌లింక్ వర్సెస్ జియో వివాదంగా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలో స్టార్‌లింక్ సేవలకు తుది అనుమతులు లభించకపోవడంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొందరు “ఒలిగార్కులు” (దేశ సంపదను, మార్కెట్‌ను శాసించే కొద్దిమంది పారిశ్రామికవేత్తలు) తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికే స్టార్‌లింక్ రాకను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. అయితే.. ఆయ‌న ఎక్క‌డా ముఖేష్ పేరును ప్ర‌స్తావించ‌డం లేదు. “అంబానీనే భారతదేశానికి నిజమైన బాస్ ఆ..?” అంటూ రెండో రోజు విమ‌ర్శించారు. ఇక‌, స్టార్‌లింక్ – రిలయన్స్ జియో మధ్య ప్రధాన ఘర్షణ శాటిలైట్ స్పెక్ట్రమ్ అంశాల‌పైనే. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయకూడదని, ప్రభుత్వం నేరుగా దరఖాస్తుల ఆధారంగా పరిపాలనాపరమైన కేటాయింపు చేయాలని మస్క్ కోరుతున్నారు.

కాగా, దేశీయ టెలికాం మార్కెట్‌లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని జియో డిమాండ్ చేస్తోంది. వేలం వేయకపోతే స్టార్‌లింక్ వంటి విదేశీ సంస్థలకు అయాచిత లబ్ధి చేకూరుతుందని ప‌రోక్షంగా చెబుతోంది. ఇక‌, స్టార్ లింక్‌కు ఎదుర‌వుతున్న మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య‌.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు. వినియోగదారుల డేటాను దేశంలోనే భద్రపరచడం, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ భద్రత తదితర అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మొత్తంగా ఈ వివాదం.. గ‌త 2జీ స్ప్రెక్ట‌మ్ ను గుర్తు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 10, 2026 11:41 pm

Share

Recent Posts

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

5 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

5 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

8 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

9 hours ago