పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి హడావిడీ లేకుండా కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ప్రేమద ఊరలి’ అనే చిత్రం ఇప్పుడు కన్నడనాట ఏకంగా 50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.
పల్లెటూరి వాతావరణంలో అమాయకంగా బతుకుతున్న తండ్రీకొడుకుల జీవితంలోకి, సడెన్ గా ఒక మోడ్రన్ అమ్మాయి ఎంటర్ అయితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నదే ఈ చిత్ర కథ. వినడానికి చాలా సింపుల్ గా అనిపించే ఈ పాయింట్ నే దర్శకుడు చాలా ఎమోషనల్ గా, వినోదాత్మకంగా మలిచాడు.
ప్రస్తుతం థియేటర్లలో ఎక్కడ చూసినా యాక్షన్, రక్తపాతం, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎలాంటి టెన్షన్ లేని ఒక స్వచ్ఛమైన రూటెడ్ విలేజ్ డ్రామా రావడం ఆడియన్స్ కు బాగా రిఫ్రెషింగ్ గా అనిపించింది. సింపుల్ హ్యూమర్, నాచురల్ ఎమోషన్స్ జనాలకు స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యాయి.
ఎవరూ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కు వెళ్లిన వాళ్లకు మంచి ఫీల్ గుడ్ ఎక్స్ పీరియన్స్ దొరికింది. దాంతో ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా ప్లస్ అయింది. మొదటి రోజు సింగిల్ స్క్రీన్లలో మొదలైన ఈ సందడి, ఆ పాజిటివ్ టాక్ పుణ్యమా అని మల్టీప్లెక్స్ లకు కూడా పాకింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కడుతుండటంతో వసూళ్ల లెక్క రోజురోజుకూ పెరుగుతోంది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ చిత్రం 2026 సంవత్సరంలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా (మోస్ట్ ప్రాఫిటబుల్) రికార్డుల్లోకి ఎక్కే ఛాన్స్ కనిపిస్తోంది. పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై ఐదు రెట్లు లాభాలు వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాల రిస్క్ తో భయపడుతున్న ఇండస్ట్రీకి ఇది మంచి బూస్ట్ ఇచ్చింది.
This post was last modified on October 10, 2026 11:37 pm
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో…
‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పులివెందుల నియోజకవర్గంలోని బకారాపురంలో హల్చల్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను…
వైసీపీ అధినేత జగన్కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో పర్యటించేందుకు వచ్చిన జగన్కు అనూ హ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో…
ఏపీలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు.. యువత సహా.. మధ్యతరగతి…
విజయదశమి పండగ వచ్చే కీలకమైన అక్టోబర్ నెల అయిపోయింది. టాలీవుడ్ బాక్సాఫిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీజన్ మిశ్రమ…