Movie News

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్ గాడి తప్పుతున్నపుడు కొంచెం జాగ్రత్తగా ‘క’ సినిమా చేశాడు. ఆ చిత్రంతో తన రాత మారింది. దాని కంటే ముందే ఒప్పుకున్న ‘దిల్ రుబా’ నిరాశపరిచినా.. ఆ తర్వాత ‘కే ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాలో మంచి ఫలితాన్ని అందుకున్నాడు కిరణ్. ఇప్పుడు అతడి సినిమాలకు చాలా మంచి బిజినెస్ జరిగే రేంజ్ ఉంది.

ఏ బ్యాగ్రౌండ్ లేని హీరో ఈ స్థాయికి చేరుకోవడం విశేషమే. వరుస సక్సెస్‌ల ఉత్సాహంలో కిరణ్ ఇప్పుడు స్వయంగా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. మెగా ఫోన్ పట్టి ‘రియాలిటీ’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాను మొదలుపెట్టిన మూడు నెలల్లోనే కిరణ్ పూర్తి చేయడం విశేషం. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే విడుదలైన ‘రియాలిటీ’ టీజర్లో కాన్సెప్ట్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. కానీ టీజర్ చివర్లో కిరణ్ ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్ మీద మాత్రం బాగా ట్రోలింగ్ జరిగింది. కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీల్లో కంటెంట్ మరీ బలంగా లేకపోయినా.. లూప్ హోల్స్ ఉన్నా.. ఆ టైంకి అన్నీ కలిసొచ్చి అనుకున్న దాని కంటే బాాగా ఆడేశాయి. వీటిలో కిరణ్ పెర్ఫామెన్స్ విషయంలో విమర్శలు వచ్చినా.. ఆ సినిమాలు బాగా ఆడడంతో ఎక్కువ చర్చ జరగలేదు.

ఓటీటీలో ఈ చిత్రాలు రిలీజైనపుడు మాత్రం కిరణ్ సోషల్ మీడియాకు కొంత టార్గెట్ అయ్యాడు. కానీ ‘రియాలిటీ’ దగ్గరికొచ్చేసరికి రిలీజ్‌కు ముందే తన నటన, హావభావాల మీద చర్చ జరుగుతోంది.
ఇది కిరణ్ స్వయంగా తీసిన సినిమా కావడంతో రిలీజ్ టైంలో తన పెర్ఫామెన్స్‌తో కంటెంట్ మీద బాగా స్క్రుటినీ ఉంటుందనడంలో సందేహం లేదు.

ఇంకోవైపేమో క్రిస్మస్ సీజన్లో అక్కినేని నాగార్జున సినిమా ‘కింగ్ 100’తో పాటు బాలయ్య మూవీ ‘దాదా’తో అతను పోటీ పడబోతున్నాడు. షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కూడా అప్పుడే రిలీజ్ కాబోతోంది. ఇంత పోటీలో థియేటర్లు దొరకడం కష్టం. లిమిటెడ్ రిలీజ్ ఉంటుంది. సినిమాలో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప హిట్ కొట్టడం అంత తేలిక కాదు. కాబట్టి ఈసారి కిరణ్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కడం అంత తేలికగా కనిపించడం లేదు.

This post was last modified on October 9, 2026 5:32 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

12 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

12 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

14 hours ago