Political News

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కింది. వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్ కు భారీగా తరలివస్తున్న విద్యార్థులు, యువకులతో ఢిల్లీ నగరం కిక్కిరిపోయింది. ఈక్రమంలో ముంబై నుంచి ఢిల్లీ వచ్చిన కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను విమానంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలిసిన నిరసనకారులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

దీప్కేను అరెస్టు చేయడం కంటే చేసిన విధానం మీద తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలిగించాలని, లేకపోతే అక్టోబర్ 10 తేదీన జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడతామని సీజెపి ప్రకటించింది. దాని ప్రకారం అభిజిత్ దీప్కే ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చాడు. విమానం ల్యాండ్ అవగానే లోపలకు ప్రవేశించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అభిజిత్ దీప్కేతో పాటుగా సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. పోలీసులు విమానంలోకి ప్రవేశించడంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

తమను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలను మొబైల్లో చిట్రీకరించిన దీప్కే ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మేం బయటకు వచ్చేంత వరకు ఆగాల్సింది, రండి.. మమ్మల్ని అరెస్టు చేయండి, మేము అరెస్టుకు భయపడం అని దీప్కే పోలీసులతో చెప్పడం వినిపించింది. ఈ దృశ్యాలు కలకలం సృష్టించాయి. దీప్కే బృందం విమానంలో వస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం ముందుగానే పెద్ద సంఖ్యలో పోలీసులను ఢిల్లీ విమానాశ్రయం వద్ద మోహరించింది. ఐబీ, సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించడం విమర్శలు పాలౌతుంది.

అభిజిత్ దీప్కే బృందాన్ని విమానంలోనే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని నిరసనకారులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు దారుణంగా వుందని చెబుతున్నారు. ఈ అరెస్టులతో ఆందోళన మరింత తీవ్రమయ్యే సూచనలు కానవస్తున్నాయి దీప్కే బృందాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా రహస్యంగా ఉంచడం ఉద్రిక్తతలను రేపుతోంది.

This post was last modified on October 10, 2026 3:28 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

2 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

2 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

5 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

5 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

6 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

8 hours ago