నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సెంటర్స్ లో ఆక్యుపెన్సీలు బాగా పెరిగాయి. బుక్ మై షో వేదికగా గత ఇరవై నాలుగు గంటల్లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మంచి పరిమాణం. ఆదర్శ కుటుంబం వల్ల పోటీ లేకపోవడం శ్రీవిష్ణుకు బాగా కలిసి వచ్చింది. అయితే ఇందులో కొన్ని సెటైర్లు మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయని టాక్.
కామ్రేడ్ కళ్యాణ్ లోని ఒక సన్నివేశంలో ఆచార్యని వ్యంగ్యంగా అనుకరిస్తూ శ్రీవిష్ణు చెప్పే డైలాగు ఒకటుంది. పాదఘట్టం, ధర్మస్థలి మధ్యలో అంటూ చెప్పే సంభాషణ బాగానే పేలింది. ఒక కామెడీ ఆర్టిస్టుకి సంజయ్ సాహూ అని పేరు పెట్టారు. ఇది జల్సాలో పవన్ కళ్యాణ్ నుంచి తీసుకున్నదని వేరే చెప్పనక్కర్లేదు. శ్రీవిష్ణు ఎర్రతువాలు భుజాన వేసుకుని సైడ్ యాంగిల్ నుంచి ఇచ్చే స్టిల్ చిరంజీవిని పోలి ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా రెఫరెన్సులే కనిపిస్తాయి.
ప్రెస్ మీట్ లో ప్యారడైజ్ కంటే ముందే కాకులు పుట్టాయని చెప్పుకొచ్చిన నిర్మాత కోన వెంకట్ సినిమాలో మాత్రం నేరుగా పారడైజ్ పేరుని వాడటం గమనార్హం. అయితే వీటిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాటి ఉద్దేశం ఎవరి మనోభావాలనో దెబ్బ తీయాలని కాదు. కేవలం స్పూఫ్ గా తీసుకుని దాని ద్వారా వినోదం పండించాలనే ప్రయత్నం చేశారు. ఆ మాట కొస్తే ఆర్ నారాయణమూర్తిని కూడా శ్రీవిష్ణు, సత్య ఇద్దరూ ఇమిటేట్ చేశారు.
ఇక కామ్రేడ్ కళ్యాణ్ కమర్షియల్ ఫలితం ఎలా ఉంటుందనేది సోమవారానికి క్లారిటీ వస్తుంది. వీకెండ్ దాకా పెద్దగా టెన్షన్ ఉండదు కానీ కీలకమైన మండే టెస్టులో కనక పాస్ అయితే టెన్షన్ ఉండదు. అదంత సులభం కాదు కానీ కొంచెం మిక్స్డ్ గా ఉన్న టాక్ ని శ్రీవిష్ణు కనక తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే ఇబ్బంది ఉండదు. ఈ మూమెంట్ కొనసాగించేందుకు టీమ్ ప్రమోషన్లను కొనసాగించే ప్లాన్ లో ఉంది. జైలర్ 2, రణబాలి వచ్చేదాకా కామ్రేడ్ కళ్యాణ్ కు ఓపెన్ గ్రౌండ్ ఉంది.
This post was last modified on October 10, 2026 10:46 am
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…