ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి నుంచి ఫౌజీ దాకా ప్రభాస్ ఇలాంటివి ఎన్ని చూశాడో లెక్క లేదు. అల్లు అర్జున్ రాకాకు కూడా ఈ బెడద తప్పలేదు. అయితే డ్రాగన్ విషయంలో జరుగుతున్న ప్రచారాలు ఏదో ఒక రూపంలో చెక్ పెట్టించాలి అనేలా ఉన్నాయి. తారక్, ప్రశాంత్ నీల్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, చాలా భాగం రీ షూట్ డిమాండ్ చేస్తోందని ఏవేవో గాసిప్స్ తిరుగుతున్నాయి.
అందువల్లే జూన్ విడుదల అనుమానమనే పుకారు గట్టిగా ప్రచారమవుతోంది. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తారక్ త్వరలోనే డ్రాగన్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. అప్పటిదాకా ఇతర ఆర్టిస్టులు అవసరమైన ఎపిసోడ్లను నీల్ పూర్తి చేస్తున్నారు. ఎలాగైనా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి సినిమాని వదిలేలా చాలా పట్టుదలతో పని చేస్తున్నారట. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న తారక్ పూర్తిగా కోలుకోవడం ఆలస్యం వెంటనే రీ స్టార్ట్ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు.
రెండు భాగాలుగా రూపొందుతున్న డ్రాగన్ గతంలో దురంధర్ చూపించిన స్ట్రాటజీని ఫాలో అవుతూ తక్కువ గ్యాప్ లో సీక్వెల్ కూడా రిలీజయ్యేలా ప్లానింగ్ లో ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. బెర్ముడా ట్రయాంగిల్, ఆఫ్గనిస్తాన్ మాఫియా, శత్రు దేశాల ఆయుధాలు, ఇండియన్ ఆర్మీ పవర్ మొదలైన ఎన్నో అంశాలను ఇందులో టచ్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా వస్తున్నాయట.
దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం చాలా సమయం వృథాగా పోయింది. ఫలితం కూడా డిజాస్టర్ కావడంతో అభిమానులు డ్రాగన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కాన్సెప్ట్ టీజర్ వచ్చేసి నెలలు గడిచిపోతున్నా కొత్త అప్డేట్ ఇప్పటి దాకా రాలేదు. వేరే ఈవెంట్లలో డ్రాగన్ ఫలానా టైంకు వస్తుందని చెప్పకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టర్లో లేదా షూటింగ్ సెట్ ఫోటోలు ఏవో ఒకటి వదులుతూ ఉంటే పాజిటివ్ వైబ్ పెరుగుతుంది.
This post was last modified on October 10, 2026 1:39 pm
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…