Political News

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని … ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే.. క‌థ అక్క‌డితో అయిపోతుందా?!. అంటే కాదు. అస‌లు ఆ దొంగ ఎటు నుంచి ఇంట్లోకి వ‌చ్చాడో గుర్తించి ఆ మార్గాల‌ను మూసి వేయ‌డం.. లేదా ఆ మార్గాల‌ను మ‌రింత ప‌టిష్ఠం చేసుకోవ‌డం అనే క్ర‌తువు ముఖ్యం. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం విష‌యం కూడా ఇలానే ఉంద‌ని జాతీయ మీడియా చెబుతోంది. దేశంలో ఉవ్వెత్తున కొన‌సాగుతున్న ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా నిర‌స‌న‌లు స‌రే. కానీ, రేపు మ‌రొక‌రు వ‌చ్చినా వ్య‌వ‌స్థ మారుతుందా? అనేది ప్ర‌శ్న‌.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ.. కాంగ్రెస్ స‌హా విప‌క్ష పార్టీలు మెరుపు స‌మ్మెల‌కు దిగ‌డం.. పోలీసులు అరెస్టు చేయ‌డం జాతీయ‌స్థాయిలో పెద్ద ఎత్తున క‌ల‌క‌లం రేపుతున్నాయి. వాస్త‌వానికి ఆయ‌న రాజీనామా చేస్తారో.. లేదో తెలియ‌దు. మ‌రోవైపు సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. వాటిపై విచార‌ణ జ‌రుగుతోంది. ఇలా.. అనేక కోణాల్లో ఉద్య‌మాలు ఊపందుకున్నాయి. కానీ, అస‌లు వ్య‌వ‌స్థ మాటేంటి? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకీ ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చిందంటే.. వ్య‌వ‌స్థ‌లోనే భారీ లోపం ఏర్ప‌డిన‌ప్పుడు.. ఇలాంటి నిరస‌న‌లు ఎన్ని జ‌రిగినా.. అవి త‌గిలిన గాయానికి పై పూత‌లుగా మారుతాయి.

ఏం జ‌రిగింది?

భారత ఎన్నిక‌ల సంఘంలో ముగ్గురు క‌మిష‌నర్లు ఉంటారు. వీరంతా ఐఏఎస్ అధికారులే. దేశంలో అనేక మంది ఐఏఎస్‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ ముగ్గురిని ఎంపిక చేయ‌డం అనేది అత్యంత కీల‌కం. ఈ క్ర‌మంలోనే ఒక బోర్డు ఏర్ప‌డి ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల‌ను ఎంపిక చేస్తుంది. ఇది అత్యంత ఉన్న‌స్థాయి బోర్డు. దీనిలో ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్షుడిగా ఉంటారు. ఇక‌, 2022-23 వ‌ర‌కు ఈ బోర్డులో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, లేదా ఆయ‌న సూచించిన న్యాయ‌మూర్తికూడా ఉండేవారు. అలానే కేంద్ర కేబినెట్లోని న్యాయ శాఖ‌ మంత్రి స‌హా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కూడా ఈ బోర్డులో స‌బ్యులు.. ఇలా.. వీరంతా చ‌ర్చించి మెజారిటీ నిర్ణ‌యం మేర‌కు క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మిస్తారు.

2023 త‌ర్వాత‌..

ఇక‌, 2023 త‌ర్వాత‌.. కేంద్ర ప్ర‌భుత్వం ఈ అత్యుత‌న్న‌స్థాయి బోర్డులో మార్పులు చేసింది. అదేమంటే.. సుప్రీంకోర్టు చెప్పింద‌ని వ్యాఖ్యానించింది. ఈ మార్పే ఇప్పుడు ఈ నిర‌స‌న‌ల‌కు కార‌ణ‌మైంది. వ్య‌వ‌స్థ‌ను లోప‌భూయిష్టంగా మార్చింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికి కార‌ణం.. ఈ అత్యున్న‌త‌స్థాయి బోర్డులో న్యాయ వ్య‌వ‌స్థ ప్రాధాన్యాన్ని తీసేశారు. మొత్తం బోర్డులో ప్ర‌ధాని, కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉండేలా చ‌ట్టం చేసేశారు. దీనికి అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో స‌ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల ఎంపిక‌.. పూర్తిగా కేంద్రం క‌నుస‌న్న‌ల్లోకి వెళ్లిపోయింది.

ఇలా.. ఎంపికైన అధికారే జ్ఞానేష్ కుమార్‌. సో.. మొత్తం వ్య‌వ‌స్థ‌నే మార్చేసిన కేంద్రం.. ఎన్నిక‌ల సంఘాన్ని ఆడిస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌కు ఇదే ప్ర‌ధాన కార‌ణం. ఇప్పుడు క‌మిష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌లు ఫ‌లించి.. ఆయ‌న రాజీనామా చేయొచ్చు. కానీ, రేపు ఆయ‌న స్థానంలోకి వ‌చ్చేదిఎవ‌రు? అనేది చూస్తే.. మ‌ళ్లీ కేంద్ర ప్ర‌భుత్వం ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న అధికారులే ఈ ప‌ద‌వుల్లోకి వ‌స్తారు. సో.. వ్య‌వ‌స్థ‌ను మార్చ‌కుండా.. కేవ‌లం క‌మిష‌న‌ర్‌ను మార్చినంత మాత్రాన‌.. లేదా రాజీనామా కోరినంత మాత్రాన‌.. ప్ర‌స్తుత స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించిన‌ట్టు కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 10, 2026 9:18 am

Share

Recent Posts

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

2 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

2 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

7 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

9 hours ago

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

10 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

11 hours ago