Movie News

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లా కేంద్రం మల్టీప్లెక్సులో ఎక్కువంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే నిర్మాత అడగ్గానే పెంపుకు అనుమతులు వచ్చేశాయి కాబట్టి. అది కూడా ఒక్కో టికెట్ మీద 50, 75 రూపాయలు ఇవ్వడంతో ప్రేక్షకుల మీద వారం రోజుల పాటు అదనపు భారం పడనుంది. అసలే స్కూళ్ళు కాలేజీలకు సెలవు రోజులు. ఆక్యుపెన్సీలు బాగా ఉండే మంచి సీజన్ ఇది.

సరిగ్గా ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. జైలర్ 2 తమిళ సినిమా. దాని టార్గెట్ కూడా ప్రాధమికంగా కోలీవుడ్ ఆడియన్స్ ఆ తర్వాతే మనం. అలాంటప్పుడు స్వంత రాష్ట్రంలో లేని హైక్ మనకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారనేది మూవీ లవర్స్ ప్రశ్న. ఆర్ఆర్ఆర్, పుష్ప, ప్యారడైజ్ మొదలైనవి మన సినిమాలు కాబట్టి బడ్జెట్ రికవరీ కోసం పెంపులు ఇచ్చినా అర్థం ఉంది. మరి జైలర్ 2 లాంటి వాటికి ఎందుకనేది అర్థం కాని ప్రశ్న.

అడగటం ఆలస్యం ఏపీ సర్కార్ వెంటనే పర్మిషన్లు ఇస్తోంది. టికెట్ రేట్ల పెంపుకి ఓకే అంటే చాలు ఇండస్ట్రీకి గొప్ప మేలు చేసినట్టు ఎవరైనా రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారేమో తెలియదు కానీ కింది స్థాయి జనంలో మాత్రం వ్యతిరేకత ఎదురవుతోంది. భారీ రేట్లకు హక్కులు కొనడం ఎందుకు, దాన్ని తిరిగి పబ్లిక్ మీదకు రుద్దడం ఎందుకనేది సగటు సినీ ప్రియుల నుంచి వస్తున్న క్వశ్చన్. బలవంతంగా చూడమని మేము చెప్పలేదని నిర్మాత అంటే, హక్కులు కొనకపోతే మేం ధర్నా చేస్తామనలేదని ప్రేక్షకులూ కౌంటర్ ఇస్తారు.

ఒకవైపు రణబాలి లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీ పెంపుకి వెళ్లకుండా మేలు చేస్తుంటే, అనువాదం చేసిన జైలర్ 2 మాత్రం నాకు ఎక్కువ కలెక్షన్లు కావాలనే రీతిలో ఇలా అవకాశాన్ని వాడుకోవడం సమర్ధనీయం కాదు. ఇది మొదటిసారి కాదు. గతంలో కెజిఎఫ్, కాంతార, కూలి, టాక్సిక్ మొదలైనవాటికి హైక్స్ ఇచ్చారు. కొన్ని లాభపడ్డాయి, కొన్ని నష్టపోయాయి. అయినా సరే ఛాన్స్ ఉంది కదాని ఇలా ప్రతిసారి అడగడం సబబేనానేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి తప్పించి ఎవరేం చేయలేరు.

This post was last modified on October 10, 2026 10:56 am

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

18 minutes ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

2 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

3 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

3 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

8 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

10 hours ago