తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వరుసగా ఆయన తిరుమల వ్యవహారాలపై స్పందిస్తున్నారు. త్వరలోనే రాజకీయపార్టీ పెడతానని చెబుతున్న సాయిరెడ్డి తాజాగా శుక్రవారం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడిన తీరు.. చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధానంగా అందరూ మరిచిపోయిన తిరుమల వెయ్యికాళ్ల మండపం వ్యవహారాన్ని ఆయన తొవ్వేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోనే తిరుమల అభివృద్ధి పేరుతో వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించారు.
ఆ తర్వాత.. దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఇక, చంద్రబాబు హయాంలో కూడా తిరిగి నిర్మిస్తామని చెప్పినా.. ఆమేరకు చర్యలు చేపట్టే ప్రయత్నం చేయలేదు. కాగా.. వైసీపీ హయాంలో కీలకపోస్టులో ఉన్న సాయిరెడ్డి.. ఈ విషయాన్ని విస్మరించారు. నిజానికి ఆయనకు శ్రీవారిపై అంత భక్తి ఉండి ఉంటే.. వైసీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా వ్యవహరించినప్పుడు.. ఎందుకు మౌనంగా ఉన్నారన్నది కీలకం. ఇక, ఈ వ్యవహారం రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతోనే సాయిరెడ్డి ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. హిందువులు, ముఖ్యంగా మఠాధిపతులను తనకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశం కనిపిస్తోంది.
మరోవైపు.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును కూడా ప్రక్షాళన చేస్తానని చెప్పడం ద్వారా మరో వివాదానికి సాయిరెడ్డి శ్రీకారం చుట్టి నట్టు కనిపిస్తోంది. టీటీడీ పాలక మండలి బోర్డులో రాజకీయ నాయకులకు చోటు లేకుండా చేస్తామని సాయిరెడ్డి చెప్పారు. దీనిలో మఠాధిపతులు, పీఠాధిపతులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని అన్నారు. కానీ, వాస్తవానికి.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా సాయిరెడ్డి 3 మాసాల పాటు టీటీడీ బోర్డులో పనిచేసిన విషయాన్ని ఆయన మరిచిపోయినట్టుగా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీ పాలక మండలిలో రాజకీయ నాయకులు ఉండడాన్ని కోర్టులు కానీ.. ఇతర సంస్థలు కానీ ఎప్పుడూ తప్పబట్టలేదు. అయినప్పటికీ.. సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరో 10 రోజుల్లో..
మరో 10 రోజుల్లోనే సాయిరెడ్డి తన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల దసరా రోజు(20న) సాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఆ రోజు పార్టీ పేరు, జెండా, అజెండాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే కొందరు నాయకులను ఆయన ఆహ్వానించినట్టు ప్రచారంజరుగుతున్నా.. ఇప్పటి వరకు ఎవరూ సాయిరెడ్డి చెంతకు చేరింది లేదు.. ఆయన నాయకత్వానికి జై కొట్టింది కూడా లేదు. వైసీపీలో తటస్థులు ఉన్నప్పటికీ.. వారు కూడా సాయిరెడ్డి నాయకత్వానికి సానుకూలంగా లేకపోవడం గమనార్హం.
This post was last modified on October 10, 2026 8:40 am
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…
కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…