Movie News

నోలన్ సినిమాను తీయడం.. మళ్లీ వేయడం..

ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మెజారిటీ ప్రేక్షకులు చెప్పే పేరు.. క్రిస్టఫర్ నోలన్. ఆయన్నుంచి ఏ సినిమా వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ దాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలిసిందే. నోలన్ చివరి చిత్రం ‘ఆపెన్ హైమర్’లో ఆయన మార్క్ థ్రిల్స్ లేకపోయినా, కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. భారీ వసూళ్లే సాధించింది. నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’కి కూడా కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా అద్భుత వసూళ్లతో దూసుకెళ్లింది.

జులై 17న సినిమా రిలీజైతే.. ఇంకా కూడా చాలా దేశాల్లో ఈ సినిమా ఆడుతోంది. ముఖ్యంగా నోలన్ సినిమా అనగానే ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లన్నీ ఆయన సినిమాకు అంకితం అయిపోవడం మామూలే. ‘ది ఒడిస్సీ’కి మరింతగా ఐమాక్స్ స్క్రీన్లలో డిమాండ్ ఏర్పడింది. సినిమా రిలీజయ్యాక కొన్ని మేజర్ స్క్రీన్లలో మూడు నెలల పాటు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. మిగతా ఐమాక్స్ స్క్రీన్లలోనూ ఈ సినిమానే నెలల తరబడి నడిపిస్తున్నారు.

ఐతే మధ్య మధ్యలో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజై.. నోలన్ చిత్రం నుంచి ఐమాక్స్ స్క్రీన్లు తీసుకుంటున్నాయి. కానీ వాటి సందడి ఎక్కువ రోజులు ఉండట్లేదు. ‘స్పైడర్ మ్యాన్’ బాగానే ప్రభావం చూపినా సరే.. కొన్ని వారాల తర్వాత ఆ సినిమాకు కేటాయించిన ఐమాక్స్ స్క్రీన్లను తీసి మళ్లీ ‘ది ఒడిస్సీ’కే ఇచ్చారు. ఇక గత వారం రిలీజైన ‘డిగ్గర్’ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లోనే చిత్రీకరించడంతో దానికి వరల్డ్ వైడ్ చాలా ఐమాక్స్ స్క్రీన్లను కేటాయించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

బ్యాడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు.
185 మిలియన్ డాలర్లతో ‘డిగ్గర్’ సినిమా తీస్తే ఫస్ట్ వీకెండ్లో వచ్చిన కలెక్షన్ 20 మిలియన్లే. సినిమా భారీ డిజాస్టర్ అని తేలిపోయింది. దీంతో వారం తిరక్కముందే వరల్డ్ వైడ్ ‘డిగ్గర్’ కోసం కేటాయించిన ఐమాక్స్ స్క్రీన్లన్నీ తిరిగి ‘ది ఒడిస్సీ’కి ఇచ్చేశారు. ఈ సినిమా వసూళ్లలో ఐమాక్స్ స్క్రీన్ల నుంచి వస్తున్న వాటా పెద్దదే. ఆ మొత్తం 540 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5200 కోట్లు) కావడం విశేషం. ఇప్పటిదాకా ‘ది ఒడిస్సీ వరల్డ్ వైడ్ 1.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.17 వేల కోట్లు) కలెక్ట్ చేసింది.

This post was last modified on October 11, 2026 7:28 pm

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

1 hour ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

2 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

2 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

4 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

5 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

5 hours ago