Political News

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి. మొత్తంగా 5 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీవీకే. బీజేపీ, ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోలీచేసిన నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల నుంచి ఇత‌ర పార్టీల నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ ఎదురీదక త‌ప్ప‌లేదు. తమిళ‌నాడులోని రెండు అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీవీకే పార్టీకి చెందిన మ‌హిళా అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే త‌ర‌ఫున పోటీచేసి గెలిచిన మ‌ర‌గ‌తం కుమార వేల్‌, స‌త్య‌భామలు.. ఆ త‌ర్వాత అధికారం చేప‌ట్టిన టీవీకే పార్టీలో చేరిపోయారు. అయితే.. వారు చేరే స‌మ‌యంలో త‌మ త‌మ స్థానాలైన మ‌ధురాంత‌కం, ధారాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌కు రాజీనామా చేశారు. అనంత‌రం.. నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌లో వారు టీవీకే త‌ర‌ఫున పోటీ చేశారు. తాజాగా ఈ నెల 6న జ‌రిగిన ఉప పోరులో విజ‌యం ద‌క్కించుకున్నారు. శుక్ర‌వారం జ‌రిగిన ఓట్ల లెక్కింపులో ఇరువురు నాయ‌కులు కూడా భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక, ప‌శ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. రెజీ న‌గ‌ర్‌, నందిగ్రామ్‌లో జ‌రిగిన ఉప పోరులో బీజేపీ అభ్య‌ర్థులు శంఖారావ్ స‌ర్కార్‌, హ‌సిరాణా ర‌త్‌లు విజ‌యం సాధించారు. అయితే.. రెజీ న‌గ‌ర్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న తృణ‌మూల్ నాయ‌కుడు బీజేపీలో చేర‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక‌, నందిగ్రామ్‌లో ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి సువేందు అధికారి విజ‌యం ద‌క్కించుకుని.. ఆ సీటును వ‌దులుకున్నారు. దీంతో ఇక్క‌డ కూడా బీజేపీనే విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని త‌ట్టంచావ‌డి నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ ఎన్నార్ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన అశోక్ ఆనంద్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్కడ 50 వేల మెజారిటీతో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి. ఇక‌, ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగావ్ పార్ల‌మెంటు స్థానాన్ని కూడా బీజేపీనే ద‌క్కించుకుంది. ఇక్క‌డ నుంచి గ‌తంలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకోగా.. అభ్య‌ర్థి..త‌ర్వాత బీజేపీలో చేరారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప పోరులో బీజేపీ అభ్య‌ర్థి విజ‌యం ద‌క్కించుకున్నారు. దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించ‌డం గ‌మనార్హం.

This post was last modified on October 9, 2026 9:02 pm

Share

Recent Posts

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

19 minutes ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

38 minutes ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

2 hours ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

2 hours ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

4 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

4 hours ago