బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం ఏర్పడింది. అయితేనేం ఇచ్చిన మాటకు కట్టుబడి వుండే నాయకుడు చంద్రబాబు వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తే అన్నీ పార్టీలు బీసీలకు 34 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల బీసీలు రాజకీయంగా ఎదుగుతారు. బీసీలు అధికారం చేపట్టడం ఇష్టంలేని వైసీపీ దీనికి అడ్డుపుల్ల వేసింది.
మొదట్నుంచి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలుస్తుంది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లోనే స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 24 శాతానికి తగ్గించడంతో 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. మళ్ళీ టీడీపీ వచ్చాకనే బీసీల గళం వినిపించింది. బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఎన్నో పథకాలు అమలు చేసింది. బీసీల ఆర్ధిక ప్రగతికి పునాదులు వేసింది.
చేతి వృత్తులను పరిరక్షించి బీసీలకు జీవనోపాధి కల్పించేందుకు ఆదరణ పథకం తీసుకొని వచ్చింది టీడీపీ ప్రభుత్వమే. ఆదరణ పథకం కింద 90 శాతం సబ్సిడీతో 341 రకాల పనిముట్లను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డెర కులస్తులకు 10 శాతం మైనింగ్ లీజులు, గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు మంజూరు చేసింది. నేతన్నలకు ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం, హ్యాండ్ లూం మగ్గాలున్న కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్ లూం మగ్గాలున్న కుటుంబాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు.
సెలూన్ షాపులు నిర్వహించే నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు 25 వేల రూపాయల వరకు సాయం అందించడం జరుగుతుంది. వేట నిషేధం వున్న సమయంలో ఆర్ధికంగా ఆదుకుంటున్నది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో పథకాలు, స్కీంలను బీసీల కోసం అమలు చేస్తోంది టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. బీసీలకు రాజకీయ గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది టీడీపీ నాయకత్వమే. గత 40 ఏళ్లుగా బీసీల రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు ఇస్తున్న టీడీపీ ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో సొంతంగా 34శాతం సీట్లు కేటాయించి మాట నిలుపుకుంటుంది.
This post was last modified on October 9, 2026 8:02 pm
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…