Movie News

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం ఎంత ముఖ్యమో వాటిని అంతే సహజంగా పలికే ఆర్టిస్టులు కూడా అంతే కీలకం. రాయలసీమకు చెందిన పోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ మొదటిసారి రణబాలిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన ట్రైలర్ లో తన యాస, పౌరుషం, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఒకటి ఒప్పుకోవాలి. పక్కా నైజాం కుర్రాడు ఇంత స్పష్టంగా సీమ యాసని ఒడిసిపట్టుకోవడం, అందులోనూ పురాతన ప్రాంతానికి చెందిన లాంగ్వేజ్ ని అంత నేరుగా సహజంగా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎక్కువ సంభాషణలు రివీల్ చేయకపోయినా చూపించిన సీన్లలో విజయ్ చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకునేలా ఉంది. మొత్తం సినిమా చూశాక తను ఎంత బాగా చేశాడనేది పూర్తి క్లారిటీ వస్తుంది. అక్టోబర్ 16 రణబాలి థియేటర్లలో వచ్చే దాకా వెయిట్ చేయాలి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన మీద నెగటివిటీ ప్రచారమవుతోందని, కొన్ని వర్గాలు పనిగట్టుకుని మరీ దీనికి తెగబడుతున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. వాటికి సమాధానం మాటల్లో కన్నా రణబాలి పెర్ఫార్మన్స్ తో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కనక కంటెంట్ తో మెప్పిస్తే దసరా పండక్కు విజయ్ ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చు. అది కూడా రజనీకాంత్ లాంటి పెద్ద హీరోని ఎదురుగా పెట్టుకుని.

విజయ్ దేవరకొండ నెక్స్ట్ చేస్తున్న రౌడీ జనార్ధన కూడా సీరియస్ బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రాంతానికి చెందిన యాసతో సాగుతుంది. ఆర్టిస్టులకు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అవసరం. అప్పుడే తమ నటనను మరింత మెరుగు పరుచుకోగలరు. రణబాలి నుంచి విజయ్ రౌడీ బాయ్ అభిమానులు ఆశిస్తున్నది ఇదే. వరస ఫ్లాపులతో కొంత వెనుకబడినట్టు కనిపిస్తున్న విజయ్ దేవరకొండకు ఈ మూవీ కనక సాలిడ్ హిట్ ఇచ్చిందంటే మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. నిర్మాణంలో ఉన్నవాటికి ఊపొస్తుంది.

This post was last modified on October 9, 2026 9:10 pm

Share

Recent Posts

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

17 minutes ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

45 minutes ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

2 hours ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

2 hours ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

4 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

4 hours ago