Political News

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి రెండు రౌండ్లలో ఫలితాల్లో ఒక అసెంబ్లీలో అన్నా డీఎంకే ముందంజలో వున్నట్లు వార్తలు వచ్చాయి. టీవీకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరి పరిస్థితి వున్నట్లు మీడియా ఊదరగొట్టింది. అంతా ఇంకేముంది… టీవీకే ప్రభుత్వం ముచ్చట అప్పుడే తీరిందనిపించింది. అయితే కొద్ది సేపటికే టీవీకే పైచేయి సాధించింది. చివరికి ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ టీవీకే విజయడంఖా మోగించింది.

తమిళనాడులో అక్టోబరు 6న జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అధికార టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే, విపక్ష డీఎంకే అన్నాడీఎంకే లను ఓడించింది. ఎన్నికలకు ముందు దారాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సత్యభామ గురించి డీఎంకే అధినేత స్థాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. దాంతో దారాపురం నియోజకవర్గం ఫలితంపై ప్రజలు చాలా ఆసక్తి చూపించారు. చివరికి ఇక్కడ నుంచి టీవీకే తరుపున పోటీ చేసిన సత్యభామ 9, 471 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మధురాంతకం నుంచి మరగతం కుమారవేల్ ఏకంగా 17,554 ఓట్ల మెజారిటీ సాధించి దుమ్ము లేపారు.

అయితే ఉదయం దారాపురంలో అధిక్యంలో వున్న అన్నా డీఎంకే సాయంత్రానికల్లా మూడో స్థానానికి పడి పోయింది. నిజానికి ఈ రెండు స్థానాలు అన్నాడీఎంకేవే కావడం గమనార్హం. 2026 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన అన్నా డీఎంకే అభ్యర్థులు ఆ తర్వాత టీవీకేలో చేరడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంటే అన్నా డీఎంకే రెండు స్థానాలు కోల్పోయింది. డీఎంకే గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచి టీవీకేకు ఏకైక ప్రత్యేర్దిగా నిరూపించుకుంది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ రెండు స్థానాలను గెలిపించుకొని తన సత్తా చాటుకున్నారు. అసెంబ్లీలో స్వల్పంగా బలాన్ని పెంచుకున్నారు. సాధారణ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ చేయడం తెల్సిందే. అందులో తిరుచిరాపల్లి ఈస్ట్ రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యింది. దాంతో పాటు మరో నాలుగు స్థానాలు ఖాళీగా వున్నాయి. న్యాయపరమైన చిక్కులు పూర్తయ్యాక అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. అంటే సీఎం విజయ్ కు ఇంకో పరీక్ష ఉందన్న మాట. మొత్తం మీద ఈ ఎన్నికల్లో తడబడతాడనుకున్న విజయ్ నిలబడ్డాడు. తొలి పరీక్షలో పాస్ అయ్యాడు.

This post was last modified on October 9, 2026 7:24 pm

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

2 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

2 hours ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

3 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

3 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

4 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

4 hours ago