Political News

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ, ఇండీ కూటమి నిరనసలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రి 10 గంటల సమయంలో విడుదల చేశారు.

అయితే, ఈ రోజు కూడా రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ప్రియాంకా గాంధీ, పలువురు మహిళా ఎంపీలు రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అరెస్టుతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా ప్రధాన డిమాండ్ గా నేడు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయయించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలంతా ఆందోళన చేపట్టారు.

పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు పాదయాత్రగా వెళ్లాలని ఇండీ కూటమి ఎంపీలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ కు వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేశారు. జ్ఞానేశ్ కుమార్ ను అరెస్టు చేయాలని, నిరసన వ్యక్తం చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేస్తారని పోలీసులను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని రోడ్డుపై నిలబడ్డారు. పోలీసులు బలవంతంగా రాహుల్ ను వ్యాన్ లోకి ఎక్కించే ప్రయత్నం చేయగా…రాహుల్ నిరాకరించారు. దీంతో, అతి కష్టం మీద రాహుల్, ఇతర ఎంపీలను అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలించారు.

ఈ క్రమంలోనే పోలీసుల తీరును ప్రియాంకా గాంధీ తప్పుబట్టారు. ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా? వారితో ఈ విధంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రియాంకా గాంధీని, ఇతర మహిళా ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

This post was last modified on October 7, 2026 6:19 pm

Share

Recent Posts

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

39 minutes ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

55 minutes ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

2 hours ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

3 hours ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

3 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

4 hours ago