Political News

క్రీడా కోటా నియామకంపై విచారణ

కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్‌ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్‌ ఎస్‌జీటీ (తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న మీడియా కథనాలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన విచారణ చేపట్టామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు డీఈఓ ఇప్పటికే విచారణ ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులు, ధ్రువీకరణ (వెరిఫికేషన్‌) ఫైళ్లను తెప్పించినట్లు వెల్లడించారు.

విచారణ పూర్తయి నివేదిక అందిన అనంతరం నియామక, సర్వీసు నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆరోపణలపై వాస్తవాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానాన్ని అవలంబించినట్లు పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటించింది. నియామక ప్రక్రియలో నిబంధనలను పాటించామని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ప్రకటన విడుదల చేశారు.

This post was last modified on September 5, 2026 9:36 am

Share

Recent Posts

కీర్తి సురేష్ సినిమాని ఎందుకు నిషేధించారు

మనం ప్యారడైజ్ మేనియాలో పడిపోయాం కానీ తమిళంలో రేపు డోరోతి విడుదల కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పేట…

4 hours ago

సితార సంస్థకు డబుల్ ప్రెజర్ ఉంటుందా

ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా…

4 hours ago

ఫౌజీ పరుగు ఎక్కడి దాకా వచ్చింది

డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే…

5 hours ago

రెంటికీ చెడిపోయిన దానం… కింక‌ర్త‌వ్యం?!

దానం నాగేంద‌ర్‌.. దూకుడు మొత్తానికే ముస‌లం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జ‌రుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన…

5 hours ago

మ‌ల‌యాళంలో కంటే 6 రెట్లు అధిక పారితోష‌కం

ప‌ర భాషా న‌టులకు మ‌న ఫిలిం మేక‌ర్స్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా తెలుగు…

5 hours ago

బూతులు తిట్టేవాళ్ల‌కు వాస్తవం చెప్పిన తేజు

అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఎంత పెద్ద ప్ర‌మాదానికి గుర‌య్యాడో గుర్తుండే…

7 hours ago