పర భాషా నటులకు మన ఫిలిం మేకర్స్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తెలుగు నుంచి హీరోయిన్లు రావడం తక్కువ, వచ్చినా మన దర్శక నిర్మాతలు వారికి ప్రయారిటీ ఇవ్వరనే ఒక అభిప్రాయం ఉంది. పాత్రలకు తగ్గట్లు వాళ్లు నటించరు, కనిపించరు అనే కంప్లైంట్ అటు వైపు నుంచి వినిపిస్తుంది. అందుకే కథ, పాత్ర ఎలాంటిదైనా చాలా వరకు పర భాషా కథానాయికల వైపే చూస్తుంటారు మన ఫిలిం మేకర్స్. డేట్లు దొరక్కపోయినా.. అధిక పారితోషకాలు ఇచ్చి మరీ వాళ్లను మన సినిమాల్లోకి తీసుకొస్తుంటారు.
మలయాళంలో చిన్న స్థాయి నటి అయిన మెరిన్ ఫిలిప్.. ఇప్పుడు తెలుగులో అనుమాన పక్షి సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. మలయాళంతో పోలిస్తే ఆమెకు ఇక్కడ భారీ పారితోషకమే ఇస్తున్నారట. అది ఆ నటి మాతృభాషలో అందుకునేదానికంటే ఆరు రెట్లు అధికమట.
ఈ విషయాన్ని స్వయంగా మెరినే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మీ దగ్గర కంటే ఇక్కడ రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకున్నారా అని అడిగితే.. ఆ సంగతి చెప్పడానికి ముందు కొంచెం తటపటాయించింది మెరిన్. తర్వాత హీరో రాగ్ మయూర్ వైపు చూసి.. తన నుంచి క్లారిటీ తెచ్చుకుని మాలీవుడ్‌లో వచ్చేదాంతో పోలిస్తే తాను ఇక్కడ ఆరు రెట్ల పారితోషకం తీసుకున్నట్లు ఆమె చెప్పింది.
ఆల్రెడీ మామిత బైజు, అనస్వర రాజన్ లాంటి మలయాళ అమ్మాయిలకు మాతృభాషలో తీసుకునేదాని కంటే మూణ్నాలుగు రెట్ల రెమ్యూనరేషన్ మన వాళ్లు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మలయాళ నిర్మాతలు కూడా తెలుగు నిర్మాతలపై గుర్రుగా ఉన్నారట.
ఐతే మన సినిమాల బడ్జెట్, స్కేల్ ఎక్కువ, పైగా వర్కింగ్ డేస్ ఎక్కువ కాబట్టే డిమాండుకు తగ్గట్లు పారితోషకం ఇచ్చి నటింపజేస్తున్నామన్నది మన ప్రొడ్యూసర్ల వాదన. డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన మెరిన్ తొలి చిత్రం అనుమానపక్షి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
This post was last modified on September 24, 2026 6:43 pm
జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…
బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…
ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…
వందలు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీలకు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…
దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా…