ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొని వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ పాలసీ గురించి ఇంటా బయట తీవ్రమైన చర్చ జరుగుతుంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ మరింత ఎక్కువగానే వుంది. దీన్ని కొందరు షుగర్ కోటెడ్ పాలసీ అని అభివర్ణిస్తుండగా మరికొందరు పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఈ పాలసీ వలన టీడీపీకి లాభమా.. నష్టమా అనే చర్చనీయాంశంగా మారింది.
డిజిటల్ మరియు సోషల్ మీడియాలను విస్తృతంగా వాడుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి పనుల గురించి మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫాలోవర్ల సంఖ్యని బట్టి ప్రభుత్వం తరపున నగదు చెల్లించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క క్రియేటర్ కు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 2500 వరకు చెల్లించనున్నారు. స్తూలంగా ఇదీ పాలసీ.
నిజానికి టీడీపీకి కేడర్ పార్టీగా పేరుంది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో టీడీపీకి ఉన్న కేడర్ మరో పార్టీకి లేదన్నది వాస్తవం. 1982లో స్థాపించిన టీడీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వున్నారు. ప్రస్తుతం టీడీపీకి 1.3 కోట్ల వరకు సభ్యులు వున్నారు. పార్టీ కోసం ఏళ్ళ తరబడి పనిచేస్తున్నవారు కోకొల్లలుగా వున్నారు. పార్టీనే నమ్ముకున్న వాళ్ళు టీడీపీలో అత్యధికంగా కనిపిస్తారు. అందుకే అధిష్టానం కూడా పార్టీ సభ్యులనుద్దేశించి ప్రస్థావించేటప్పుడు టీడీపీ కుటుంబ సభ్యులు అనే చెబుతుంది.
పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాళ్ళు, లాఠి దెబ్బలు తిన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా వున్నారు. సోషల్ మీడియాలో స్వచ్చందంగా గళమెత్తే కేడర్ ను పక్కన పెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ కోసం నిలబడి, కలబడుతున్న తమను కాదని పెయింగ్ ఆర్టిస్టులకు చెల్లింపులు చేస్తామనడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
వైసీపీ హయాంలో కార్యకర్తలను విస్మరించి వాలంటీర్లను నమ్ముకొని చేతులు కాల్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ల కంటే పార్టీలో వున్న కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం అప్పగించడం వలన పార్టీకి మేలు చేస్తుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఇన్ఫ్లుయెన్సర్ వర్గం అనేది పార్టీలకు అతీతంగా ఉండడంతో వారి ద్వారా ప్రచారం చేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుందనేది ప్రభుత్వ వర్గాల వాదన. మరి ఈ కార్యకర్తల ప్రశ్నలకు జవాబు దొరుకుతుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on September 24, 2026 5:56 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…
దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…
జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…
సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో…
జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…