ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా నిర్మాణం కానీ డిస్ట్రిబ్యూషన్ ఉండేలా చూసుకుంటోంది. ఆగస్ట్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్నప్పటికీ ఈ నెల రెండో వారంలో వచ్చిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. పెట్టుబడి తక్కువే అయినా ఫారిన్ లొకేషన్ లో తీయడం, మార్కెటింగ్ విస్తృతంగా చేయడం లాంటివి బడ్జెట్ పరంగా రికవరీని కష్టతరం చేశాయి.
ఇదిలా ఉండగా తక్కువ గ్యాప్ లో నిర్మాత నాగవంశీ మీద రెండు పెద్ద బాధ్యతలు పడబోతున్నాయి. మొదటిది ఆదర్శ కుటుంబం ఏకె 47. అక్టోబర్ తొమ్మిది విడుదల కాబోతున్న ఈ సినిమా మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి వెంకటేష్ ని డైరెక్ట్ చేశారు. దాంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ప్రమోషన్స్ పరంగా టీమ్ అంత దూకుడుగా లేకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తున్నా వచ్చే వారం నుంచి గేర్ మార్చబోతున్నారు.
ఆదర్శ కుటుంబం తన స్వంత సంస్థది కాబట్టి వీలైనంత బెస్ట్ రిలీజ్ ఇచ్చేందుకు నాగవంశీ కృషి చేస్తారు. ప్యారడైజ్ అప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటుంది కాబట్టి సరిపడా స్క్రీన్లు దొరికేస్తాయి. అక్టోబర్ 15 విడుదల కానున్న రజనీకాంత్ జైలర్ 2 పంపిణి హక్కులు నాగవంశీనే తీసుకున్నారు. ఏపీ తెలంగాణ రెండు చోట్ల ఆయనవే రైట్స్. ఆదర్శ కుటుంబానికి సర్దుబాటు చేస్తూనే జైలర్ 2కి మంచి ప్లానింగ్ ఉండేలా చూసుకుంటే ఓపెనింగ్స్, రెవిన్యూ బాగా వస్తాయి.
ఇక్కడో సమస్య ఏమిటంటే అక్టోబర్ 16 రణబాలి ఉంది. విజయ్ దేవరకొండకు కంబ్యాక్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. మైత్రి నిర్మాతలతో నాగవంశీకున్న అనుబంధం కోణంలో చూసుకుంటే అంతగా సమస్య కాకపోవచ్చు. టాక్ బాగా వచ్చినవాటికి న్యాయం జరిగేలా సర్దుబాటు చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇవన్నీ లెక్కలేసుకునే బరిలో దిగి ఉంటారు. ఆదర్శ కుటుంబం, జైలర్ 2 రెండూ విజయం సాధిస్తే మటుకు కాసుల కామధేనువు ఆఫీసులో కొలువు తీరినట్టే.
This post was last modified on September 24, 2026 8:00 pm
జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…
బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…
ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…
వందలు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీలకు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…
దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా…