Movie News

సహకారం నిజంగా అందలేదా

నిన్న విడుదలైన చిన్న సినిమాల్లో కాస్త జనాల దృష్టిలో పడ్డ వాటిలో సహ కూడా ఉంది. మూవీ నచ్చకపోతే అమీర్ పెట్ సెంటర్లో గుండు కొట్టించుకుంటానని హీరోయిన్ శపధం చేయడం, యాభై కోట్ల గ్రాస్ వస్తుందని, బాలేకపోతే నాకు ఫోన్ చేయమని హీరో నెంబర్ ఇవ్వడం లాంటివి మీడియాలో హైలైట్ అయ్యాయి. దీంతో సహజంగానే ప్రీమియర్లకు చెప్పుకోదగ్గ రెస్పాన్స్ కనిపించింది. హైదరాబాద్ లో వేసిన షోలు చాలా మటుకు ఫుల్ కనిపించాయి. ముఖ్యంగా యూత్ సపోర్ట్ వచ్చింది.

అయితే సహ టీమ్ చెబుతున్న దాని ప్రకారం తమకు చాలా అన్యాయం జరిగిందని, ఆక్యుపెన్సీలు ఎక్కువగా ఉండే సాయంత్రం, రాత్రి షోలు కాకుండా పగలు జనాలు ఉద్యోగాలకు, పనులకు వెళ్లే ఉదయం ఆటలు ఇవ్వడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇరవై షోలు కూడా లేకపోతే వసూళ్లు ఎలా వస్తాయని అంటున్నారు. నిజమే ఇందులో కొంత లాజిక్ లేకపోలేదు. విపరీతమైన కాంపిటీషన్ మధ్య సహ థియేటర్లలో అడుగు పెట్టింది. చాలా చోట్ల స్క్రీన్లు అందుబాటులో లేవు.

ఇంత టైట్ సిచువేషన్ లో ఉనికిని చాటుకోవడం చాలా కష్టం. సహకు అండగా నిలబడాల్సింది టాక్ మాత్రమే. కానీ ప్రాథమికంగా చూస్తే అవేమంత యునానిమస్ గా అయితే రాలేదు. నిజాయితీగా ఒక ప్రేమికుడి కథను చెప్పారని, కానీ అన్ని వర్గాల ఆడియన్స్ కి ఆకట్టుకోవడం గురించి పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. పైగా ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, ఎలివేషన్లు బాగా ఆడుతున్న ట్రెండ్ లో ఇలాంటి బరువైన భావోద్వేగాలు ఏ మేరకు వర్కౌటవుతాయనే డౌట్ లేకపోలేదు.

తుది ఫలితం తేలడానికి ఇంకా టైం పడుతుంది కానీ సహ ఒకటే కాదు పలు సందర్భాల్లో పేరున్న స్టార్ సినిమాలు కూడా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఎక్కడిదాకో ఎందుకు అంత పెద్ద ఇరుముడికి టాక్సిక్ వల్ల అయిదో రోజే స్క్రీన్ల సమస్య వచ్చింది. డబ్బింగ్ మూవీ ఫ్లాప్ కావడం వల్ల సరిపోయింది కానీ లేదంటే రవితేజ సైతం కలెక్షన్లలో కోతను చూడాల్సి వచ్చేది. ఇలాంటి సహకారాలు అందని సమస్య ఇప్పుడే కాదు పరిశ్రమను ఎప్పటి నుంచో వేధిస్తున్నదే. 

This post was last modified on September 5, 2026 7:29 am

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

45 minutes ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

1 hour ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

3 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

4 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

5 hours ago