Movie News

బూతులు తిట్టేవాళ్ల‌కు వాస్తవం చెప్పిన తేజు

అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఎంత పెద్ద ప్ర‌మాదానికి గుర‌య్యాడో గుర్తుండే ఉంటుంది. బైక్ న‌డుపుతూ అదుపు త‌ప్ప‌డంతో అత‌ను తీవ్ర గాయాల‌పాలై ఆసుప‌త్రికి చేరాడు. కొన్ని వారాల పాట హాస్పిట‌ల్లోనే ఉన్న తేజు.. త‌ర్వాత మ‌రి కొన్ని నెల‌లు ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ప్రాణాపాయం త‌ప్పించుకున్నాడు కానీ.. ప్ర‌మాదం త‌ర్వాత త‌న రూపురేఖ‌లు మారిపోయాయి.

చాన్నాళ్ల పాటు శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఇప్ప‌టికీ అత‌ను మునుప‌టంత ఉత్త‌మ స్థితికి రాలేదు. ఐతే అంత పెద్ద ప్ర‌మాదం త‌ర్వాత కోలుకుని మళ్లీ సినిమాలు చేసే స్థాయిలో ఉండ‌డ‌మే గొప్ప‌. అందుకే ఆ ప్ర‌మాదం గురించి త‌ర‌చుగా ప్ర‌స్తావిస్తూ దాన్ని త‌న పున‌ర్జ‌న్మ‌గా చెబుతుంటాడు తేజు. రోడ్డు ప్ర‌మాదాల విష‌యంలో జ‌నాల‌ను హెచ్చ‌రిస్తూ కూడా ఉంటాడు.

తాజాగా మ‌రోసారి ఆ ప్ర‌మాదాన్ని గుర్తు చేసుకుని.. తాను పున‌ర్జ‌న్మ ఎత్త‌డానికి కార‌ణ‌మైన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. ఐతే ఆ ప్ర‌మాద స‌మ‌యంలో తేజును కాపాడి స‌మ‌యానికి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన అబ్దుల్ స‌య్య‌ద్ ఫ‌ర్హాన్‌ను త‌ర్వాత ఈ మెగా హీరో ప‌ట్టించుకోలేదంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. కొంద‌రు బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై తేజు వెంట‌నే స్పందించాడు. అబ్దుల్‌, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వ‌డం.. అత‌ణ్ని స‌త్క‌రించ‌డం.. ఆర్థిక సాయం అందించ‌డ‌డం గురించి ప్ర‌స్తావించాడు.

సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం అబ్దుల్ ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం తాను గడుపుతున్నాడని,అబ్దుల్ త‌న స్వేచ్ఛ‌కు భంగం వాటిల్ల‌కుండా చూడాల‌న్న ఉద్దేశంతో త‌నకు సంబంధించిన స‌మాచారాన్ని సామాజిక మాధ్య‌మాల్లో పంచుకోవ‌ట్లేదని తేజు చెప్పాడు. ఈ సంగతి పంచుకోవ‌డం ద్వారా త‌న విమ‌ర్శ‌కుల‌కు చెంప‌పెట్టు లాంటి స‌మాధానం చెప్పిన తేజు.. త‌న‌ను బూతులు తిట్టి, అభ్యంత‌ర‌క‌ర కామెంట్లు చేసిన వాళ్ల ప‌ట్ల కూడా సానుకూలంగానే మాట్లాడాడు. త‌న‌ను దీవించిన వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని.. వాళ్లంతా కూడా బాగుండాల‌ని తేజు కామెంట్ చేశాడు.

This post was last modified on September 24, 2026 7:51 pm

Share

Recent Posts

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…

2 minutes ago

అక్టోబర్ 15న తెలుగుప్రభ రీలాంచ్.. ‘జనం కోసం జర్నలిజం’

జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…

3 hours ago

బిట్టు కష్టం వృథా అయిపోయింది

బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…

10 hours ago

మాయమైన దేవుళ్ళ కోసం ‘హైందవ’ వేట

ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…

12 hours ago

ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి… ట్రంకు పెట్లలో పత్రాలు

వంద‌లు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీల‌కు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివ‌రాల‌తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…

14 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా

దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…

14 hours ago