మనం ప్యారడైజ్ మేనియాలో పడిపోయాం కానీ తమిళంలో రేపు డోరోతి విడుదల కానుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాలో అప్ కమింగ్ ఆర్టిస్టులను తప్ప ప్రత్యేకంగా స్టార్లు ఎవరు లేరు. ఇళయరాజా సంగీతం సమకూర్చడం ప్రధాన ఆకర్షణగా నిలవగా ఈ వయసులో పెద్దాయన ఈ మూవీ ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇంత కంటెంట్ ఉన్న డోరోతిని మలేషియాలో రిలీజ్ కానివ్వడం లేదు. కారణం నిషేధం.
ఎందుకో ఏంటో చూద్దాం. మలేషియాలో LGBTQ+ కంటెంట్ ని వినోద మాధ్యమాల్లో వాడుకోవడం కుదరదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో స్వలింగ సంపర్కాన్ని చూపించే ఎలాంటి సినిమా, సీరియల్ అయినా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోదు కాక ఒప్పుకోదు. షాక్ ఏంటంటే డోరోతిలో ఇద్దరు హీరోల మధ్య అలాంటి కాన్సెప్ట్ ఉందట. దాన్ని ఇప్పటిదాకా రివీల్ చేయకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ లోనూ క్లూస్ ఇవ్వలేదు, ఇప్పుడీ బ్యాన్ వల్ల విషయం బయట పడింది.
దీని పట్ల పలు తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఇలాంటి సినిమాలు తీయడం ఏమిటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ కు అండగా నిలుస్తున్న వాళ్ళు లేకపోలేదు. చూడకుండా తీర్పులు ఎలా ఇస్తారని, సున్నితమైన ఈ విషయాన్ని తెరమీద ఎలా హ్యాండిల్ చేశాడో చూశాక ఒక నిర్ణయానికి రావాలి తప్పించి ఇలా ఉన్నఫళంగా నిరసన చెబితే ఎలాని కౌంటర్లు ఇస్తున్నారు. కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగు డబ్బింగ్ కు సంబంధించి డోరోతి టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అనువాదం చేస్తారో లేదో బహుశా బాక్సాఫీస్ ఫలితాన్ని బట్టి ఉంటుందేమో. జిగర్ తండా డబుల్ ఎక్స్ కమర్షియల్ గా విజయం సాధించాక రెట్రో రూపంలో కార్తీక్ సుబ్బరాజ్ తో పాటు సూర్యకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడీ డోరోతినే దర్శకుడికి ఊరట కలిగించాలి. రేపు ఈపాటికి రివ్యూలు, రిపోర్టులు వచ్చేస్తాయి కాబట్టి మ్యాటర్ ఏంటో తేలిపోతుంది. కీర్తి సురేష్ పాత్రలో ఏమైనా సర్ప్రైజులు ఉంటాయేమో.
This post was last modified on September 24, 2026 11:32 pm
ఇతర ప్రొడక్షన్ హౌసెస్ దూకుడు తగ్గించి ఉండొచ్చేమో కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మటుకు నెలకు కనీసం ఒక సినిమా…
డిసెంబర్ 3 నుంచి తప్పుకున్నాక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద సందిగ్దత వీడలేదు. టీమ్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవలే…
దానం నాగేందర్.. దూకుడు మొత్తానికే ముసలం తెచ్చింది. ఆ.. ఏం చేసినా.. ఏం జరుగుతుందిలే.. అని లైట్ తీసుకుని వేసిన…
పర భాషా నటులకు మన ఫిలిం మేకర్స్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తెలుగు…
అయిదేళ్ల ముందు టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా ఫ్యామిలీ కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఎంత పెద్ద ప్రమాదానికి గురయ్యాడో గుర్తుండే…
బాలీవుడ్లో గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీకి పేరుంది. ఆయన తీసిన తక్కువ సినిమాలే అయినా.. వాటిలో…