Political News

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్ 2గా ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. కట్ చేస్తే… సజ్జల ఎంట్రీతో విజయసాయి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వెరసి సాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనపై సజ్జల కోటరీ దుష్ప్రచారం చేయించిందని, సజ్జల తనపై గతంలో దాడి కూడా చేశారని సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు జగన్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదని, తనకు అవమానం జరిగినా ఆయన సైలెంట్ గా ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పోతే పో అన్న రీతిలో తనను వదులుకున్న జగన్ కు ఇంకా స్వామిభక్తి చూపించాల్సిన అవసరం లేదని సాయిరెడ్డి భావిస్తున్నారట. అందుకే, ఇటీవల సజ్జలకు రాసిన లేఖలో అప్రూవర్ అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారట.

వాస్తవానికి ఆ విషయం అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ, జగన్ వైఖరితో తీవ్ర మనస్తాపం చెందిన సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యంతోనే ఆ విషయం ప్రస్తావించారట. గతంలో అప్రూవర్ గా మారే ఛాన్స్ ఉన్నా మారలేదని ఆయన లేఖలో రాశారు. అంటే, ఇప్పుడు అప్రూవర్ గా మారి జగన్ ను ఇరుకున పెట్టాలని సాయిరెడ్డి భావిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

తన సేవలకు, త్యాగానికి, జైలు జీవితానికి ఏ మాత్రం విలువ, గుర్తింపు లేదన్న ఆవేదనతో విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారట. అందుకే, తన కొత్త పార్టీ ప్రకటించడానికి ముందే సాయిరెడ్డి ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని టాక్ వస్తోంది. అక్రమాస్తుల కేసుల లోగుట్టును ఆయన విప్పబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.

ఆడిటర్‌గా జగన్ క్విడ్ ప్రో కో వ్యాపారాలు, షెల్ కంపెనీల రూటింగ్, ఆర్థిక లావాదేవీల సాక్ష్యాలు… ఇలా జగన్ అక్రమాస్తుల కేసుల చిట్టాను చిత్రగుప్తుడి మాదిరిగా తన దగ్గర భద్రంగా సాయిరెడ్డి పెట్టుకున్నారట. ఒకవేళ ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు, పుకార్లు నిజం చేస్తూ విజయసాయిరెడ్డి ఆ చిట్టాను అధికారుల ముందు విప్పితే మాత్రం జగన్ కు చిక్కులు తప్పవు.

This post was last modified on September 1, 2026 7:09 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago