Political News

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ కిర్కిస్థాన్ కు వెళ్లారు. అక్కడ శాంఘయ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇన్ స్టా లో విడుదల చేసిన వీడియోలో మన దేశ పారిశ్రామిక వేత్తలకు, ధనవంతులకు ఈ విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో భారీ ఖర్చులతో చేస్తున్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ కల్చర్ కు గుడ్ బై చెప్పాలని సూచించారు. అదేదో భారత్ లోనే చేసుకుంటే స్థానిక వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల బిలియన్ల యూఎస్ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ అవసరం లేకపోతే బంగారం కొనడం మానేయమంటూ సలహా ఇచ్చారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించు కోవాలని, దేశీయంగా తయారైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్లవుతుందని చెప్పారు.

ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటి సారిగా ప్రధాని ఇదే సలహా ఇచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు మోదీ చేసిన ప్రసంగం కలకలం సృష్టించింది. దేశ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని, దీనికి మోదీ ప్రకటనే నిదర్శనమని కాంగ్రెస్, ఇతరా ప్రతిపక్ష పార్టీలు విరుచుకొని పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సైతం మోదీ ప్రసంగం పై ఎవరికీ తోచినట్లు వాళ్ళు కథనాలు ప్రచురించారు.

అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో భారత్ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని ప్రకటించిన ప్రధాని మోదీ 140 కోట్ల ప్రజల ఐక్యత దేశాన్ని బలోపేతం చేస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వృద్ధిని ప్రజలు పండుగ చేసుకోవాలని కోరారు. కోవిడ్ తర్వాత ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కూడా దేశ ఆర్ధిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

This post was last modified on September 1, 2026 8:16 pm

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago