Movie News

ఆర్ఆర్ఆర్ కూడా ఇరుముడి వెనకే

ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి ఆరు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్లే. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చివరి రెండు సినిమాలు నిరాశ పరిచాయి. నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ కూడా సక్సెస్ లో లేదు. ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ ఏమో రూ.45 కోట్లు. సినిమా సిద్ధం అవుతున్న దశలో ఆ మొత్త రికవర్ అయ్యి రవితేజకు ఒక మోస్తరు విజయం దక్కినా చాలు అనే దశలో ఉన్నారు అభిమానులు.

అలాంటిది ఈ సినిమా పది రోజుల్లోనే దాదాపు రూ.180 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. ఇంకా కూడా ఆ సినిమా జోరు తగ్గట్లేదు. రెండో సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీలతో కళకళలాడుతున్నాయి ‘ఇరుముడి’ థియేటర్లు. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఈ సినిమాను కొన్న ప్రతి బయ్యర్ మూణ్నాలుగు రెట్ల లాభాలు అందుకుంటుండడం విశేషం. దీన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయి సక్సెసో అర్థం చేసుకోవచ్చు.

నార్మల్ టికెట్ల రేట్లతో రిలీజ్ చేయడం, పెయిడ్ ప్రిమియర్స్ వేయకపోవడం వల్ల ‘ఇరుముడి’ నంబర్స్ కొంచెం చిన్నవిగా కనిపిస్తున్నాయి కానీ.. ఈ సినిమా లెవెలే వేరు అని చెప్పాలి. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రికార్డులను సైతం బద్దలు కొట్టే రేంజిలో బాక్సాఫీస్ విధ్వంసాన్ని సాగిస్తోంది ‘ఇరుముడి’. రెండో శుక్రవారం ‘బాహుబలి-2’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి ఈ చిత్రానికి. ఇక కొవిడ్ తర్వాత నైజాం (తెలంగాణ)లో అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదైన చిత్రంగానూ ‘ఇరుముడి’ రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.

అంటే ‘ఆర్ఆర్ఆర్’ కంటే కూడా ‘ఇరుముడి’కి ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయట. బాహుబలి-2, బాహుబలి చిత్రాలు మాత్రమే దీని కంటే ముందున్నట్లు సమాచారం. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి మరో రికార్డును ‘ఇరుముడి’ దాటేసింది. సీడెడ్ (రాయలసీమ)లో రెండో సోమవారం 1.01 కోట్ల షేర్‌ సాధించింది. ఒక్క బాహుబలి-2 మాత్రమే రెండో సోమవారం దీని కంటే ఎక్కువగా రూ.1.10 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ అయ్యేసరికి ‘ఇరుముడి’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి మరి.

This post was last modified on September 1, 2026 8:18 pm

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

2 hours ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

2 hours ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

3 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

3 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

3 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

7 hours ago