Political News

ఇక ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు

ఆర్టీసీలో త్వరలో మహిళా డ్రైవర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆర్టీసీలో మహిళా కండక్టర్లను నియమించిన ఘనత దేశంలో తెలుగు దేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ డిపోలకు ఎలక్ట్రానిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఆ బస్సులను మహిళలు నడపాలని చెప్పారు. త్వరలో ఏసీ బస్సులు వస్తున్నాయని, మహిళలు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో మంగళవారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మూస రాజకీయాలు, పరిపాలనకు భిన్నంగా ప్రజలకు ఏమి కావాలో వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం పట్ల సానుకుల స్పందన వ్యక్తం అవుతుంది.

మొగల్తూరులో చంద్రబాబు తన మనసులో మాటను ప్రజలతో స్పష్టంగా పంచుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని, రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పట్టాలెక్కించడానికి ఇంత సమయం పట్టిందన్నారు.

డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 350 కేసులు వేసినట్లు గుర్తు చేశారు. అయినా వెనకంజ వేయకుండా పరీక్షలు నిర్వహించి, నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేక డీఎస్సీలో అక్రమాలు జరిగాయని కొత్త రాగం అందుకున్నారని, దాన్ని డీఎస్సీ ఉద్యోగులే వ్యతిరేకస్తున్నారని చెప్పారు.

సంక్షేమం పేద ప్రజలను నిలబెట్టాలని, తాత్కాలికంగా ఉపశమనం కలిగించాలని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 75, 503 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చామని, ఈ డబ్బులతో మూడు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చన్నారు. అయినప్పటికీ పేదలకు అండగా నిలబడాలని పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో 9 సార్లు విధ్యుత్ చార్జీలు పెంచినట్లు ఆరోపించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని చెప్పారు.

This post was last modified on September 1, 2026 4:51 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago