ఇప్పటిదాకా న్యాచురల్ స్టార్ ట్యాగ్ తో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటూ వచ్చిన నాని దసరా, హిట్ 3తో తన పంథా మార్చుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ తోనే ఆ ప్రయత్నం బలపరచాలని చూశాడు కానీ మార్కెట్ పరంగా రేంజ్ పెంచుకునే అవకాశం ఇస్తోంది మాత్రం ది ప్యారడైజే. ఎల్లుండి రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న ఈ మాస్ యాక్షన్ గ్రాండియర్ కోసం జనం ఎంతగా ఎదురు చూస్తున్నారో బుకింగ్స్ గమనిస్తే అర్థమైపోతుంది. క్షణాల్లో ఫుల్స్ అవుతున్నాయి.
ఇంకా ప్రీమియర్ షోలవి స్టార్ట్ చేయలేదు. తెలంగాణ జీవో వచ్చేసింది. ఏపీది ఏ క్షణమైనా బయటికి రావొచ్చు. పెంపు ఎంతనేది పక్కన పెడితే నానికి ఇంత ధర ఎక్కువని ప్రేక్షకులు ఫీలవ్వడం లేదు. ప్యారడైజ్ గురించి చూసిన వార్తలు, తెలుసుకున్న విశేషాలు, నిర్మాణానికి జరిగిన ఖర్చు వెరసి హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. నాని కమర్షియల్ స్టామినా అమాంతం పెంచే అవకాశం దగ్గర్లో ఇంకో సినిమా ఇస్తుందో లేదో కానీ ప్యారడైజ్ మాత్రం బంగారు బాతులా కనిపిస్తోంది.
నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చూపిస్తున్న నమ్మకం కనక నిజమైతే ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ థియేటర్ రెవిన్యూ భారీగా వస్తుంది. ఇరుముడి తర్వాత బాక్సాఫీస్ సైలెంట్ అయిపోయింది. పెద్దగా చప్పుడు లేదు. మొన్న శుక్రవారం నాలుగైదు కొత్త రిలీజులు వస్తే ఆక్యుపెన్సీలు మరీ అన్యాయంగా ఉన్నాయని ట్రేడ్ వాపోతోంది. ఎలాగూ ప్యారడైజ్ చూడాలి కాబట్టి ఇప్పుడు పెద్దగా బజ్ లేని సినిమాలను ఏం చూస్తాం లెమ్మని జనం లైట్ తీసుకున్నారు. దానికి తగ్గట్టే పబ్లిక్ టాక్, రివ్యూలు ఉన్నాయి.
ప్యారడైజ్ కనక విజయవంతమయితే నాని ఎలాంటి డౌట్ లేకుండా టయర్ 1 లీగ్ లోకి వెళ్ళిపోతాడు. కెజిఎఫ్, పుష్ప రేంజ్ టాక్ తెచ్చుకుంటే కనిష్టంగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల దాకా వసూళ్లు ఆశించవచ్చు. టైం లేకపోవడం వల్ల హిందీ, తమిళ వెర్షన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు కానీ అవి కూడా వర్కౌట్ అయితే ఊహించని నెంబర్లు నమోదు కావడం ఖాయం. కయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ ఇందులో ప్రధాన తారాగణం.
This post was last modified on September 21, 2026 10:51 am
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…