డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని కొంతకాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిజం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. అయినా వైసీపీ తప్పుడు ప్రచారం ఆపకపోవడంతో డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు రాష్ట్రం మొత్తం నిరసన ర్యాలీలు చేశారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా టీచర్లు కూడా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
స్పోర్ట్స్ కోటా టీచర్లు ఏమన్నారంటే….
ఫేక్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించామని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో బాధేస్తుందని స్పోర్ట్స్ కోటా టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం తమ జీవితాలను బలి చేయవద్దని, మాపై నిందలు వేయవద్దని వేడుకున్నారు. మేము ఎలాంటి క్రీడల్లో పాల్గొనకుండా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తెచ్చుకున్నామని చెబుతున్నారు కదా…ఆన్లైన్లో మా వివరాలన్నీ వున్నాయి చూడండి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేము పాల్గొన్నామని తెలిపారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో శివారెడ్డి అనే ఉపాధ్యాయుడు చేసిన ప్రసంగం కంటతడి పెట్టించింది. నేను 40 జాతీయ ఖో-ఖో పోటీల్లో మన రాష్ట్రం తరుపున ఖో ఖో ఆడాను. జాతీయ స్థాయిలో మూడుసార్లు స్వర్ణ పతకాలు సాధించాను. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాను. అయినా మీరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మాపై చేస్తున్న అసత్య ప్రచారాలతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కష్టపడి ఉద్యోగం సాధించిన సంతోషం లేకుండా చేస్తున్నారని పలువురు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి మొత్తం 370 మంది టీచర్లు హాజరయ్యారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ప్రదర్శించారు. దేశంలో ఇప్పటి వరకు అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేయడం సహజంగా జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉద్యోగులు ర్యాలీలు చేయడం ఇదే ప్రధమని మేధావులు చెబుతున్నారు. డీఎస్సీ మీద ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరుతున్నారు.
This post was last modified on September 21, 2026 10:49 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…