Movie News

సౌండ్ సరిపోతుందా సర్దార్

కార్తీకి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవసరమైన టైంలో వస్తున్న సినిమా సర్దార్ 2. సెప్టెంబర్ పది విడుదలకు గ్రౌండ్ రెడీ అయ్యింది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి తమిళ తెలుగు వెర్షన్లు ఒకే రోజు రాబోతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ ప్రమోషన్లు మొదలైపోగా త్వరలో కార్తీ, ఎస్జె సూర్య హైదరాబాద్ వచ్చి ఇక్కడా ప్రచార పర్వం మొదలుపెట్టబోతున్నారు. కార్తీ డ్యూయల్ రోల్ చేసిన ఈ స్పై డ్రామాలో మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు.

నిన్న ట్రైలర్ వచ్చింది. కథేంటో చెప్పేశారు. సర్దార్ వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద మిషన్ మీద జపాన్ వెళ్లి వేలాది ప్రాణాలు కాపాడతాడు. కానీ స్వంత ఊళ్ళో జరిగిన విషాదాన్ని ఆపలేక అయినవాళ్లను పోగొట్టుకుంటాడు. తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల జైలుకి వెళ్లి బయటికి వస్తాడు. కట్ చేస్తే సర్దార్ కొడుకు అచ్చం అదే రూపంలో పెద్దవాడు అవుతాడు. ఇద్దరు కలిసి దేశ వినాశనానికి పూనుకున్న ఒక కిరాతకుడిని ఎదిరించడానికి రెడీ అవుతారు.

ప్రొడక్షన్ వేల్యూస్ గట్రా భారీగా ఉన్నాయి. కార్తీ రెండు షేడ్స్ లో డిఫరెంట్ గా ఉన్నాడు. అయితే మొదటి భాగం ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జపాన్ ఎలిమెంట్, ఎస్జె సూర్య పాత్రని కొత్తగా జోడించారు. సర్దార్ 1 వచ్చినప్పుడు ఈ జానర్ లో డ్యూయల్ రోల్ కొత్త కాబట్టి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయడం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈసారి పెద్ద వయసు కార్తీకి ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చారు.

ముందు వెనుకా టాలీవుడ్ లో సర్దార్ 2కి పోటీ బాగానే ఉంది కానీ గత కొంత కాలంగా యాక్షన్ థ్రిల్లర్స్ రాలేదు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కార్తీ ఏమైనా వాడుకుంటాడేమో చూడాలి. కాకపోతే ఎస్జె సూర్యని ఇప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ లో చాలానే చూశాం కాబట్టి అది అసలు సినిమాలో రొటీన్ అనిపించకుండా ఎలా మేనేజ్ చేశారో చూడాలి. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చిన సర్దార్ 2 కి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, మారెమ్మ, మందాడి, మహేంద్రగిరి వారాహి రూపంలో పెద్ద కాంపిటీషన్ స్వాగతం చెబుతోంది. 

This post was last modified on September 1, 2026 5:45 pm

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

1 hour ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

5 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

7 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

8 hours ago