సోషల్ మీడియా జనాలు దేనికి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతారో తెలియదు. ఎవరి మనోభావాలు ఎందుకు, ఎలా దెబ్బ తింటాయో అర్థం కాదు. ముఖ్యంగా ఫిలిం సెలబ్రెటీల మీద ఉండే విపరీతమైన ఫోకస్ వల్ల.. ఏ చిన్న అవకాశం వచ్చినా ట్రోల్స్‌తో మీద పడిపోతుంటారు. ఈ మధ్య యాక్టర్లు సినిమాల్లో తమ పాత్రల కోసం ఉపయోగించే భాష.. బయట మాట్లాడే యాస మీద కూడా జనాలు దృష్టిపెడుతున్నారు. అందులో కూడా లోపాలు వెతికి ట్రోల్ చేస్తున్నారు.
బేసిగ్గా కన్నడ అమ్మాయి అయినా.. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇక్కడి అమ్మాయి అయిపోయింది రష్మిక మందన్నా. ఆమె ఇప్పటికే తెలుగు బాగా నేర్చేసుకుంది. ఐతే విజయ్‌తో కలిసి ఉండడం వల్లో ఏమో.. ఈ మధ్య తెలంగాణ యాస కొంచెం అలవాటవుతోంది. రష్మిక కూడా ఆ యాసలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరగొచ్చు. కానీ ఆమెది ఫేక్ తెలంగాణ యాక్సెంట్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆనంద్ దేవరకొండ సినిమా ఎపిక్ ప్రమోషనల్ ఈవెంట్‌కు వచ్చినపుడు రష్మిక యాస మీద పెద్ద డిస్కషన్ పెట్టేశారు సామాజిక మాధ్యమాల్లో.
తనను ఈ విషయంలో ట్రోల్ చేస్తున్న విషయం రష్మికకు తెలిసిందో లేదో కానీ.. తాజాగా మైసా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో కొందరు తన యాస గురించి ప్రస్తావించారు. తెలంగాణ యాస వచ్చేసినట్లుందే అంటూ కామెంట్ చేయగా.. కొందరు పరోక్షంగా ట్రోల్స్ గురించి కూడా ప్రస్తావించారు. దాని గురించి రష్మిక స్పందిస్తూ.. తాను ఏ యాసలో మాట్లాడినా సరే, చెప్పాలనుకునే విషయం అర్థమవుతోంది కదా.. అది చాలు అంటూ ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.
ఇక మైసా సినిమా కోసం పడ్డ కష్టం గురించి రష్మిక మాట్లాడుతూ.. గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం తన ఎమోషన్ అంతా ఇచ్చేశానని, మైసా కోసం ఏకంగా లైఫ్ అంతా ఇచ్చేశానని వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో తనతో ఎన్నెన్నో చేయించారని.. అది మామూలు కష్టం కాదని ఆమె వ్యాఖ్యానించింది. అండర్ వాటర్ సీక్వెన్స్ చేయమన్నారని.. తనకు ఈత వచ్చు కాబట్టి ఓకేలే అనుకున్నానని, కానీ 8 గంటల పాటు నీటిలో ఉండాలని చెబితే తనేమైనా చేపనా అనిపించిందని ఆమె చమత్కరించింది. మైసా నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on September 21, 2026 7:01 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…