Movie News

రక్తంతో తడిసిన మైసా… ర‌ష్మిక విస్ఫోట‌నం

కెరీర్లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు చేసిప్ప‌టికీ.. ఇంకా ర‌ష్మిక మంద‌న్నా అంటే ఒక‌ క్యూట్ అమ్మాయిగానే జ‌నాల‌కు గుర్తుకొస్తుంది. క్యారెక్ట‌ర్ల‌లో వేరియేష‌న్ చూపించినా.. చాలా వ‌ర‌కు సుకుమారంగానే క‌నిపిస్తూ వ‌చ్చింది. హిందీలో న‌టించిన‌ ఛావా మాత్ర‌మే కొంచెం మిన‌హాయింపు. ఐతే ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ ఇప్పుడు త‌న కెరీర్లోనే మోస్ట్ వ‌యొలెంట్ పాత్ర‌లోకి ట్రాన్స్‌ఫామ్ అయిపోయింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన మైసా సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజ‌ర్ చూస్తే.. ఈమె ర‌ష్మిక‌నేనా అని షాక‌వ్వ‌డం గ్యారెంటీ.

తీవ్ర‌ అన్యాయానికి గురైన ఒక ప‌ల్లె ప‌డుచు.. నిరాశావాదం నుంచి విప్ల‌వం వైపు అడుగు వేసే క‌థ ఇది. నిస్స‌హాయురాలు కాస్తా.. వీర వ‌నిత‌గా మారి అరాచ‌క శ‌క్తుల మీద‌, వ్య‌వ‌స్థ మీద పోరాడితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. ఇంత మంది మీద ఒక్క అమ్మాయి పోరాడ‌డం అసాధ్యం అని ఇంకో పాత్ర‌తో చెప్పించ‌డం.. ఆ త‌ర్వాత ఆ అమ్మాయి విశ్వ‌రూపాన్ని చూపించ‌డం ద్వారా టీజ‌ర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు.

యాక్ష‌న్ సినిమాల్లో హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మోస్ట్ వ‌యొలెంట్‌గా క‌నిపించిన ర‌ష్మిక‌.. ఫైట్ల‌లో చిత‌గ్గొట్టేసింది. ర‌ష్మిక తంతే త‌ల రౌండు తిరిగిపోయే ఒక షాట్ టీజ‌ర్‌కే హైలైట్. ఇలాంటి వ‌యొలెంట్ షాట్స్ టీజ‌ర్లో మ‌రి కొన్ని ఉన్నాయి.

చివ‌ర్లో చెప్పిన డైలాగ్‌ను బ‌ట్టి చూస్తే.. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న్ ఇందులో కీల‌కంగా ఉండ‌బోతోందని అర్థ‌మ‌వుతోంది. విల‌న్‌గా కొత్త న‌టుడెవ‌రో చేసిన‌ట్లున్నాడు. రావు ర‌మేష్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్, శత్రు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. స్టార్ హీరోల సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో క‌థ‌లో భారీత‌నం, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ క‌నిపిస్తున్నాయి.

విజువ‌ల్స్.. బీజీఎం.. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు టీజ‌ర్లో బాగా హైలైట్ అయ్యాయి. ర‌ష్మిక కెరీర్లో ఇదొక గేమ్ చేంజ‌ర్ అయి, ఆమెకు యాక్ష‌న్ ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమా అయ్యేలా క‌నిపిస్తోంది మైసా. అజ‌య్, అహిల్, వీర‌సాయి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. న‌వంబ‌రు 27న మైసా ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది.

This post was last modified on September 20, 2026 8:19 pm

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

6 hours ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

6 hours ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

7 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

7 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

7 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

10 hours ago