డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఏకంగా రూ.53 లక్షలు సంపాదించాడు చెన్నైకి చెందిన శంకర్. అవును.. మీరు విన్నది నిజమే. ఎనిమిదేళ్లుగా స్విగ్గీతోనే కొనసాగుతున్న అతడు.. తన కష్టంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చుకున్నాడు.
పిల్లలను బాగా చదివించాలన్నదే శంకర్ దంపతుల ప్రధాన లక్ష్యమట. ఈ క్రమంలో స్విగ్గీలో డెలివరీ పార్ట్‌నర్‌గా చేరిన శంకర్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం పనిచేశాడు.
ఏడాదికి రూ.6 లక్షలకు పైగా సంపాదించిన శంకర్.. ఎనిమిదేళ్లలో మొత్తం రూ.53 లక్షలు ఆర్జించినట్లు స్విగ్గీ వెల్లడించింది. తనకు నచ్చిన సమయంలో పనిచేసుకునే స్వేచ్ఛ ఈ పనిలో ఉండటం కూడా తనకు కలిసొచ్చిందని శంకర్ చెప్పాడు.
నిత్యం ట్రాఫిక్, కాలుష్యం, ఎండ, వర్షం వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థతో కొనసాగడం అంత సులభం కాదు. ఈ కష్టానికి వచ్చిన సంపాదనతో ఇప్పుడు పిల్లలను మంచిగా చదివించుకుంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గాయని శంకర్ తెలిపాడు.
స్విగ్గీ తన అంతర్గత వేదికల్లో డెలివరీ పార్ట్‌నర్ల విజయగాథలను పంచుకుంటూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన శంకర్ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏ పని అయినా కష్టపడి చేస్తే మంచి ఫలితం దక్కుతుందనే దానికి శంకర్ ప్రయాణం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
This post was last modified on September 21, 2026 6:59 am
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…