Political News

తెలంగాణా ప్రభుత్వంలో కొత్త రక్తం అవసరం

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సమాయాత్తం కావల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలను మధనం చేసుకొని పార్టీని, కేడర్ ను సంసిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారని దాంతో పాటుగా పరోక్షంగా కొన్ని చురకలాంటించారని విశ్లేషకులు చెబుతున్నారు.

గుత్తా మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. కొత్త రక్తం వస్తే ప్రభుత్వంలో, పార్టీలో ఉత్సాహం కనిపిస్తుందని, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన స్వేచ్ఛగా పనిచేందుకు సహకరించాలి, ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి, మంత్రివర్గ సహచరులకు సూచించారు. సామాన్యుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మరింత ప్రచారం అవసరమని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతుందని, గ్రూపు తగాదాలు, అలకలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటినవారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టమని తేల్చిపడేశారు. పార్టీలో లీకేజీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెన్షన్లు పెంచుతామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఏ పార్టీలోనూ క్రమశిక్షణ లేదని గుత్తా చెప్పడం గమనార్హం.

ఇటీవల చిన్నారెడ్డి, కొండా సురేఖ వివాదాలు కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించడం తెలిసిందే. అంతకుముందు కూడా కోమటిరెడ్డి ఎపిసోడ్ నడిచింది. పరిపాలన సజావుగా సాగుతున్న సమయంలో సరిగ్గా ఎవరో ఒకరు సమస్యలు సృష్టించడం మామూలైపోయింది.
ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం వున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on August 29, 2026 10:07 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago