Movie News

మ‌హేష్ బాబుకు క‌థ చెప్పిన సుధ కొంగ‌ర‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మొద‌ట్నుంచి టాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయాడు కానీ.. త‌న‌కు ఇత‌ర భాష‌ల్లోనూ మంచి డిమాండే ఉంది. త‌న కోసం క‌థ‌లు త‌యారు చేసే ద‌ర్శ‌కులు వేరే ఇండ‌స్ట్రీల్లోనూ చాలామందే ఉన్నారు. బాలీవుడ్ నుంచే ఆయ‌న‌కు ఆయ‌న‌కు అనేక ఆఫ‌ర్లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు.

కోలీవుడ్‌లోనూ మ‌ణిర‌త్నం, గౌత‌మ్ వాసుదేవ్ మేన‌న్ లాంటి లెజెండ‌రీ డైరెక్ట‌ర్లు మ‌హేష్‌తో సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు కానీ.. కుద‌ర‌లేదు. ఈ జాబితాలో తెలుగు అమ్మాయే అయిన త‌మిళ ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర కూడా ఉంద‌ట‌. ఆమె కూడా మ‌హేష్ బాబుకు ఒక క‌థ చెప్పింద‌ట‌. కానీ ఏవో కార‌ణాల‌తో ఆ సినిమా ముందుకు క‌ద‌ల్లేద‌ని సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ కుమార్ ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

ఇటీవ‌లే విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్, ఇరుముడి చిత్రాల‌తో తెలుగులో పెద్ద హిట్లు కొట్టిన జి.వి.ప్ర‌కాష్‌.. త్వ‌ర‌లోనే మండాడి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్‌తో ఎక్కువ సినిమాలు చేయ‌క‌పోవ‌డం, రెండు చిత్రాల‌కే ప‌రిమితం కావ‌డం మీద అడిగిన ప్ర‌శ్న‌కు అతను స‌మాధానం చెబుతూ.. మ‌హేష్‌, సుధ కాంబో గురించి మాట్లాడాడు.

విజ‌య్‌తో సినిమా చేయ‌డానికి వెట్రిమార‌న్‌తో పాటు సుధ కొంగ‌ర ఇద్ద‌రూ ప్ర‌య‌త్నించార‌ని.. కానీ విజ‌య్ వెంట‌నే సినిమాలు చేయాల్సి ఉండ‌గా, ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులూ స్క్రిప్టు కోసం టైం అడిగార‌ని.. దీంతో విజ‌య్ త‌న కాల్ షీట్ల‌ను బీస్ట్ మూవీకి ఇచ్చేశాడ‌ని.. ఈ రెండు చిత్రాలు మెటీరియ‌లైజ్ అయి ఉంటే.. తానే సంగీతం అందించేవాడిన‌ని చెప్పాడు.

విజ‌య్ కోసం సుధ అనుకున్న‌ది సూప‌ర్ స్క్రిప్టు అని.. త‌ర్వాత అదే క‌థ‌ను మ‌హేష్ బాబుకు కూడా సుధ చెప్పింద‌ని.. కానీ ఏవో కార‌ణాల‌తో ఆయ‌న‌తో కూడా సినిమా ముందుకు క‌ద‌ల్లేద‌ని ప్ర‌కాష్ తెలిపాడు. సుధ భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా ఈ క‌థ‌తో సినిమా చేస్తుంద‌ని, ఆ ప్రాజెక్టుకు తానే సంగీతం అందిస్తాన‌ని జి.వి. తెలిపాడు.

This post was last modified on August 30, 2026 12:21 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

3 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

5 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

6 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

6 hours ago