Movie News

టాలీవుడ్ సినిమాకు భాషా భేదాలుండవు

సోషల్ మీడియాలో టాలీవుడ్ నెటిజెన్లు ఒక్కోసారి మహా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సున్నితమైన అంశాల మీద ఊరికే సాగదీస్తూ మా భాష గొప్పంటే మా భాష గొప్పని అక్కర్లేని డిబేట్లు చేస్తుంటారు. తాజాగా ప్యారడైజ్ నుంచి కొత్త పాట విడుదలయ్యాక మరోసారి ఈ రచ్చ మొదలయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలే. అందులోనూ ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్న విషయం మర్చిపోయి మేమంటే మేమంటూ గొప్పలు పోవడం ట్రొలింగ్ తో మొదలుపెట్టి ఎటెటో వెళ్తోంది.

ఆ మధ్య ఇడుపు కాయితం టైటిల్ మీద ఎంత రచ్చ జరిగిందో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. ఆన్ లైన్ వేదికగా చాలా డిబేట్లు జరిగాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ సినిమా అయినా రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తేనే సూపర్ హిట్ అవుతుంది. నేటివిటీ ప్రధానంగా ఈ మధ్య ఎక్కువ చిత్రాలు వస్తున్న మాట నిజమే. అవసరం కూడా. స్టార్స్ లేని బలగం కావొచ్చు, వంద కోట్లు వసూలు చేసిన దసరా కావొచ్చు ఇవన్నీ తెలంగాణ నేపధ్యాన్ని బలంగా ప్రెజెంట్ చేసినవి.

అలాని ఇంకో తెలుగు రాష్ట్రంలో ఆడకుండా పోలేదు కదా. కొన్ని ఏరియాల వసూళ్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా అవి ఎప్పటికీ చెప్పుకునే గొప్ప సినిమాలయ్యాయి. ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో తీసినవి బోలెడు ఆడాయి, ఆడుతూనే ఉన్నాయి. గోదావరి అందాలను వాడని దర్శకులని వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. కథానుసారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను దర్శకులు తమ సబ్జెక్టుకు తగ్గట్టు టచ్ చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే.

టాలీవుడ్ స్థాయి పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వచ్చింది. వారణాసి సినిమాకే రావొచ్చని వరల్డ్ ఫిలిం మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రాకా లాంటివి హాలీవుడ్ లోనూ సంచలనాలు నమోదు చేసే అవకాశముంది. మనతో పోటీ పడేందుకు హిందీ నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మన దర్శకులతో పని చేసేందుకు అక్కడి స్టార్లు తాపత్రయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కటిగా ఉండటం మానేసి ఏపీ తెలంగాణ అంటూ వాదనలు పెట్టుకోవడం అర్ధరహితం. 

This post was last modified on August 29, 2026 9:55 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

47 minutes ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

1 hour ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

4 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

4 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

7 hours ago