దేశంలో అతిపెద్ద వ్యాపార గ్రూపుల్లో ఒకటైన టాటాలో ఇప్పుడు కీలకమైన వివాదం కోర్టు వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లు కొనసాగించాలని ఇటీవల బోర్డు నిర్ణయించింది. కానీ టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా దీనిని అంగీకరించడం లేదు. సెప్టెంబర్ 17న తీసుకున్న ఆ నిర్ణయమే చెల్లదని ట్రస్ట్స్ వాదిస్తోంది. చంద్రశేఖరన్ నియామకాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటానికి వెళ్లేందుకు టాటా ట్రస్ట్స్ సిద్ధమవుతోంది. NCLTను ఆశ్రయించాలా, బాంబే హైకోర్టుకు వెళ్లాలా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ గొడవలో ప్రధానంగా ఓటింగ్ విధానంపైనే రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. టాటా సన్స్ బోర్డులో నలుగురు చంద్రశేఖరన్ కొనసాగేందుకు మద్దతు ఇచ్చారు. నోయెల్ టాటా వ్యతిరేకించారు. అయితే టాటా సన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి కీలక నిర్ణయాలకు ట్రస్ట్స్ తరఫున బోర్డులో ఉన్న డైరెక్టర్ల మద్దతు కూడా అవసరమని టాటా ట్రస్ట్స్ చెబుతోంది. నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ షరతు నెరవేరలేదనేది వారి వాదన.
ఇప్పటికే నోయెల్ టాటా ఈ విషయంపై టాటా సన్స్‌కు లేఖ రాశారు. చంద్రశేఖరన్‌ను తిరిగి నియమిస్తూ తీసుకున్న తీర్మానం మొదటి నుంచే చెల్లదని అందులో పేర్కొన్నారు. టాటా సన్స్ నుంచి అధికారిక సమాధానం వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్లే విషయంపై ట్రస్ట్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉంది.
మరోవైపు టాటా సన్స్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాలా వద్దా అనే అంశం కూడా ఈ వివాదంలో కీలకంగా మారింది. టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా ఉంది. లిస్టింగ్‌ను నోయెల్ టాటా వ్యతిరేకిస్తుండగా, సెప్టెంబర్ 17 బోర్డు సమావేశంలో మెజారిటీ డైరెక్టర్లు దానికి మద్దతు ఇచ్చారు. ఈ వ్యవహారంలో RBI కూడా ముందుగానే బాంబే హైకోర్టును ఆశ్రయించింది. టాటా సన్స్ లిస్టింగ్‌పై ఎవరైనా కోర్టుకు వెళితే, తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేవియట్ దాఖలు చేసింది.
ఈ వివాదం కోసం అవసరమయ్యే న్యాయపరమైన ఖర్చులకు టాటా ట్రస్ట్స్ ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. అయితే ట్రస్టీలు విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్ మాత్రం దీనికి సంబంధించిన తీర్మానాలపై సంతకం చేయలేదు. ప్రతి న్యాయపరమైన అంశాన్ని విడిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది
This post was last modified on September 21, 2026 1:26 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…