సామాన్య జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖుల్లోనూ పెద్ద సంఖ్యలో వీరాభిమానులను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాము పవర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పుకునే సినీ ప్రముఖులు చాలామందే ఉన్నారు. అందులో దిల్ రాజు కూడా ఒకరు. పవన్ కెరీర్ ఆరంభంలో చేసిన తొలి ప్రేమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా తాను పంపిణీ రంగంలో నిలదొక్కుకున్నట్లు దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పారు.
పవన్‌తో సినిమా తీయడం తన కల అని చాలాసార్లు చెప్పిన ఆయన.. చివరికి వకీల్ సాబ్ మూవీతో ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఐతే మంచి సినిమానే తీసినా, ఆ మూవీకి పాజిటివ్ రివ్యూలు, టాక్ వచ్చినా.. కొవిడ్ టైంలో పరిస్థితులు అనుకూలించక అనుకున్న దాని కంటే తక్కువ వసూళ్లే రాబట్టింది. యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది.
వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సమస్యలు గుర్తుండే ఉంటాయి. పాత జీవోను బయటికి తీసి స్పెషల్ షోలన్నీ క్యాన్సిల్ చేసి, 5 రూపాయల కనీస ధరతో టికెట్లు అమ్మించింది ప్రభుత్వం. దీంతో వసూళ్లు బాగా తగ్గాయి.
ఈ సినిమా వల్ల తాము ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తించి పవన్ తమకు చేసిన సాయాన్ని ఇప్పుడు నాని మూవీ ది ప్యారడైజ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో గుర్తు చేసుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమా పారితోషకంలో తాను మరో 5 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌ను రిలీజ్ తర్వాత పవన్‌కు చెల్లించాల్సి ఉందని.. కానీ తమకు ఎదురైన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని పవన్ ఆ డబ్బులు తీసుకోలేదని దిల్ రాజు చెప్పాడు.
పైగా వకీల్ సాబ్ పారితోషకాన్ని జనసేన పార్టీ కోసం ఉపయోగించిన విషయం మరో వేదికలో పవన్ చెప్పడం గురించి దిల్ రాజు ప్రస్తావించారు. పవన్ తొలి ప్రేమ మూవీతో తాను డిస్ట్రిబ్యూటర్‌గా నిలదొక్కుకోవడం గురించి ప్రస్తావిస్తూ తాను పవన్‌కు ఎంత పెద్ద ఫ్యానో మరోసారి గుర్తు చేశారు దిల్ రాజు. ఇక ప్యారడైజ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోందని.. ఆ సంస్థ ఇరుముడితో 50 కోట్లు కొట్టిందని, ప్యారడైజ్ కూడా నైజాంలో 50 కోట్లు కొల్లగొడుతుందని జోస్యం చెప్పారు రాజు.
This post was last modified on September 22, 2026 6:23 am
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…