Movie News

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట మొదలుపెట్టింది. మొట్టమొదటిసారి ఒకేచోట ఒకేసారి 37 ఆర్టిస్టులతో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి యాక్షన్ ఎపిసోడ్ చేయడం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డును సంపాదించుకుంది. పుష్పతో టాలీవుడ్ లో మొదటి జాతీయ అవార్డు అందుకున్నట్టే బన్నీ ఖాతాలో మరో మైలురాయి తోడయ్యింది. మేకింగ్ ఎలా జరిగిందో వీడియో రిలీజ్ చేశారు.

నాలుగు నిమిషాల ఫుటేజ్ లో ఈ ఆలోచనకు అంకురార్పణ ఎలా జరిగింది, స్టూడియో సెటప్ ఎలా చేసుకున్నారు, విదేశీ నిపుణులు ఎవరెవరు పాల్గొన్నారు లాంటివన్నీ ఇందులో పొందుపరిచారు. అట్లీ, బన్నీ స్వయంగా వివరించిన విశేషాలు ఉన్నాయి. మోషన్ క్యాప్చర్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. గతంలో విక్రమసింహ, రోబో లాంటి చిత్రాల్లో వాడారు. అవి మెయిన్ ఆర్టిస్టులకే పరిమితం చేశారు. కానీ రాకా అలా కాదు. చిన్నా పెద్దా కలిపి ఒకేసారి 37 మంది మీద చేసింది.

నిజానికి ఏదైనా టీజర్ వస్తుందని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. అట్లీ బర్త్ డే కాబట్టి దానికి అనుగుణంగా ఒకటి రెండు నిమిషాల విజువల్ కంటెంట్ వస్తుందేమోనని ఆశపడ్డారు. అయితే అట్లీ ఇప్పుడప్పుడే ఆ ఆలోచనలో లేడు. రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2027లో సాధ్యమవుతుందా లేదానే దాని మీద బోలెడు అనుమానాలున్నాయి. చూస్తుంటే 2028లోనే రిలీజ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఇంత ముందుగా టీజర్లు ఇచ్చే సాహసాలు ఎవరూ చేయరు.

దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న రాకాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని ముందు నుంచి లీక్స్ వస్తూనే ఉన్నాయి కానీ అఫీషియల్ గా టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందుతున్న రాకాని సన్ పిక్చర్స్ చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. సాయి అభ్యంక్కర్ సంగీతం మీద ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న మూవీ ఇదే. రెండు భాగాలు ఉంటుందనే ప్రచారమైతే ఇండస్ట్రీల్లో జోరుగా ఉంది.

This post was last modified on September 22, 2026 7:54 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago