మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్రస్తుత వైసీపీ నేత, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలీసులతో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఏకంగా పోలీసులపైనే ఎక్కేసి.. ఆయన చేసిన ఫీట్లు.. తీవ్రస్థాయిలో ఆగ్రహానికి కారణమైంది. విజయవాడలో వైసీపీ నేతలు చేపట్టిన నిరసనకు అవినాష్ నేతృత్వం వహించారు. ఈ క్రమంలో జిల్లా నుంచి యువతను సమీకరించారు. వీరిలో రౌడీషీటర్లు, దొంగలు, పిక్‌పాకెటర్లు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా వైసీపీ చేపట్టిన ఈ నిరసన తీవ్ర రగడకు దారి తీసింది. అయితే.. చిత్రం ఏంటంటే.. జిల్లా అధ్యక్ష స్థానంంలో ఉన్న అవినాష్.. స్వయంగా పోలీసులపైకే ఎక్కేయడం.. విమర్శలకు తావిచ్చింది.
ఏం జరిగింది?
డీఎస్సీ 2025కు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసనలో డీసీపీ స్థాయి అధికారి కూడా పాల్గొని దాడులు, ఘర్షణలను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆయన ఆందోళన కారుల మధ్యలోకి వెళ్లారు. అయితే.. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి.. ఆయన బూటు లేస్ ఊడిపోయింది. దీంతో దానిని సరిచేసుకునేందుకు ముందుకు వంగారు. ఇదే అదునుగా.. బారికేడ్లను దాటుకుంటూ.. సదరు డీసీపీ స్థాయి అధికారి భుజాలపైకి.. అటు నుంచి కానిస్టేబుల్ భుజాలపైకి అవినాష్ ఎక్కేసి.. విజయవాడలోని క్రీడాప్రాదికార సంస్థ(శాప్)లోకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసులు నివ్వెర పోయారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక ఆందోళనలు జరిగినా.. ఇలా ఏకంగా పోలీసు అధికారిపైనే చేయి వేసి.. ఆయనపైకి ఎక్కేసి కుప్పిగంతులు వేసిన నాయకులు లేరు. ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సీపీ కార్యాలయం వెల్లడించింది. ఇక, టీడీపీ వైపు నుంచి ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా.. పోలీసుల చేతులను గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశారు. కొందరు ఇదే సమయంలో పోలీసుల చేతుల్లోని లాఠీలను కూడా లాక్కున్నారు. మొత్తంగా.. అవినాష్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను నివ్వెరపోయేలా చేసింది.
స్పందించని వైసీపీ..
విజయవాడలో వైసీపీ కార్యకర్తలు చేసిన దారుణాలపై వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే.. ఇదంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అగ్రనాయకుల డైరెక్షన్‌లో అవినాష్ రెచ్చిపోయారని అంటున్నారు. జగన్ కళ్లలో ఆనందం కోసం పోలీసులపైనే ఎక్కి నడుచుకుంటూ వెళ్లిపోయారని.. మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి వారైనా ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక, ఈ పరిణామాలపై వైసీపీ మౌనంగా ఉండడం, పోలీసులు కేసులు నమోదు చేయడంతో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on September 22, 2026 6:20 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…