Movie News

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా ఇలాంటి ఎన్నో వివాదాలు అనుభవమే. ఇప్పుడు అలనాటి నటీమణులు రాధ, అంబికల మధ్య కూడా ఆస్తి వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా కనిపించిన రాధ, అంబికల మధ్య ఇప్పుడు ఇంత పెద్ద వివాదం రాజుకోవడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తన సోదరి అంబికతో పాటు సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌ కలిసి.. తన సంతకం ఉన్న బ్లాంకు చెక్కులను ఉపయోగించి 46 కోట్ల రూపాయలు కాజేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ రాధ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె తన కంప్లైంట్లో పేర్కొన్న ప్రకారం.. వ్యాపార అవసరాల నిమిత్తం ఆమె ‘ఏఆర్ఎస్’ స్టూడియో పేరుతో ఉన్న ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారు. సిబ్బంది జీతాలు, పన్నులు, ఇతర ఖర్చుల కోసం కొన్ని చెక్కులపై ముందుగానే సంతకం చేసి చెన్నైలోని తన ఇంట్లో పెట్టేవారట.

2025 జనవరి నుంచి ఈ సంస్థ పేరు ‘ఆర్ఆర్ గార్డెన్స్‌’గా మార్చడంతోపాత చెక్కులను ఉపయోగించడం ఆపేశారు. ఐతే పాత చెక్ బుక్‌లోని ఐదు చెక్కులను అంబిక, మల్లికార్జున్ దొంగిలించారన్నది రాధ ఆరోపణ. సెప్టెంబర్ 17న అంబిక పేరుతో రూ. 46 కోట్ల మొత్తానికి ఐదు చెక్కులను బ్యాంకులో ఇచ్చినట్లు అధికారులు తనకు సమాచారం ఇచ్చారని రాధ కంప్లైంట్లో పేర్కొన్నారు.

వెంటనే అప్రమత్తమైన తాను ఆ చెక్కులు నిలిపివేయాలని బ్యాంకు అధికారులకు చెప్పానని.. అంబికకు తాను ఎలాంటి చెక్కులూ ఇవ్వలేదని, అంత పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన ఒప్పందం ఏదీ తమ మధ్య లేదని ఆమె స్పష్టం చేశారు.

అంతే కాక అంబికతో తనకున్న ఆస్తి తగాదాల గురించి కూడా రాధ ఈ సందర్భంగా వెల్లడించారు. ఏడాదిన్నరగా తనను తన ఆస్తిలోకి అడుగుపెట్టనివ్వడం లేదని.. అక్కడ విలువైన వస్తువులు, నగలు, పత్రాలు ఉన్నాయని రాధ తన ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాధ ఒకప్పుడు తెలుగు, తమిళం సహా దక్షిణాదిన అన్ని భాషల్లోనూ అగ్ర కథానాయికగా వెలుగొందారు. అంబిక కూడా తమిళంలో పేరున్న నటే. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య ఇప్పుడు ఇంత పెద్ద వివాదం రాజుకోవడం చర్చనీయాంశం అయింది.

This post was last modified on September 22, 2026 9:52 am

Share

Recent Posts

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

1 hour ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

2 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

4 hours ago