తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరిన సురేఖ.. తాజాగా ఆయన నివాసానికి చేరుకున్నారు.
అంతకుముందు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సురేఖ.. సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి–మంత్రి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఇద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాఖీ పండుగను కుటుంబ అనుబంధానికి ప్రతీకగా భావించే నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సురేఖ తీసుకున్న నిర్ణయం రాజకీయంగానూ చర్చకు దారితీసింది.
సీఎం నివాసానికి సురేఖ చేరుకోవడంతో.. భేటీలో ఏం చర్చిస్తారన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates