మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం అంతగా పట్టించుకునేవారు కాదేమో కానీ రవితేజ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కావడంతో అంతో ఇంతో సోషల్ మీడియాలో సౌండ్ వినిపించింది. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాస్ మహారాజ స్వయంగా వచ్చి ఆశీర్వదించడంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మారెమ్మ ఫలితం అన్ని రకాలుగా నిరాశపరిచేలా వచ్చింది.
సరైన కథా కథనాలు రాసుకోకుండా, స్క్రిప్ట్ చెక్ చేసుకోకుండా, ఏదో గ్రామీణ నేపథ్యం పెట్టేశాం, డివోషనల్ టచ్ ఇచ్చేశాం, హీరోకి గెడ్డం పెట్టి మాస్ లుక్ రప్పించాం అని సంబరపడ్డారే కానీ నిజంగా ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోలేదు. పైగా హీరో మాధవ్ భూపతిరాజు యాక్టింగ్ కూడా ఇంకా ప్రాధమిక స్టేజిలోనే ఉండటం నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది. దీంతో వీకెండ్ కూడా క్యాష్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో మారెమ్మ త్వరగా సెలవు తీసుకునేలా ఉంది.
మాధవ్ భూపతిరాజు స్వయంగా రవితేజ తమ్ముడు రఘు కొడుకు. పెదనాన్నగా తనకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చాడు కానీ అసలు విషయంలో బలం లేనప్పుడు మాస్ రాజా అయినా ఏం చేయగలడు. అందుకే తన వంతు మద్దతుని ఈవెంట్ రూపంలో ఇచ్చేసి సైలెంట్ అయ్యాడు తప్పించి లేనిపోని ఎలివేషన్లు, పొగడ్తలు సోషల్ మీడియాలో గుప్పించలేదు. కాకపోతే ఇకపైన మాధవ్ ఎంచుకునే కథలకు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తే బెటరేమో.
అయినా కొత్త హీరోలు ఎవరైనా డెబ్యూగా వీలైనంత సింపుల్ సబ్జెక్టులను ఎంచుకోవాలి తప్పించి ఏదో ట్రెండ్ ఉంది కదాని మారెమ్మ లాంటివి ట్రై చేస్తే ఇలా రివర్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పోటీ ఎక్కువగా ఉన్న టైంలో విడుదల చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఎపిక్ వీక్ అయినా, మహేంద్రగిరి వారాహికి మిక్స్ టాక్ ఉన్నా మారెమ్మ వాటికన్నా చాలా వెనుకబడిపోయింది. మొత్తం డామినేషన్ మండాడిదే అయిపోయాక ఎవరేం చేయగలరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates