అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. మూడేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టలేక పోయానంటూ తెలంగాణా రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతున్న సమయంలో ఈసారైనా కేటీఆర్ కు రాఖీ కడతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి తీవ్రంగా స్పందించిన కవిత గత ఏడాది రాఖీ పండుగ సమయంలో ఆయన నగరంలో లేకుండా ముఖం చాటేశారు, ఈ ఏడాది అడగక ముందే ఏకంగా విదేశాలకు వెళ్లి పోయాడని కామెంట్ చేశారు. పండుగ రోజు అందుబాటులో లేకుండా పోయిన అన్న కేటీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాఖీ అంటే రక్తబంధం, రాజకీయం కాదని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తించిన తీరుతో హర్ట్ అయ్యానంటూ ఫీలయ్యారు. ఒక ఆడబిడ్డగా నాకు ఆత్మ గౌరవం ఉంటుందని చెప్పారు. కవిత కామెంట్స్ తెలంగాణా పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీశాయి. రాజకీయాలు, కుటుంబ బంధాల మధ్య విభజన రేఖ మాయమైపోయిందని, అన్నీ విషయాలు కలగాపులగమై బంధాలు దూరం అవుతున్నాయని సామాజిక వేత్తలు విశ్లేషణ చేస్తున్నారు.
ఇదిలావుండగా కేటీఆర్ కూతురు కల్వకుంట్ల అలేఖ్య కు అమెరికాలోని ప్రతిష్టాత్మక వర్జీనియా టెక్ యూనివర్శిటీలో ఉన్నత విద్యనభ్యసించేందుకు సీటు వచ్చింది. అడ్మిషన్ కోసం కేటీఆర్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన 15 రోజులు వుంటారు. కనుక రాఖీ పండుగకు ఆయన హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇందులో నిజానిజాలు దేముడికే తెలియాలని టీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on August 27, 2026 10:11 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…