Political News

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేసేందుకు స‌ర్కారు అవ‌కాశం క‌ల్పించింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 100 కోట్ల ప్ర‌యాణాలు న‌మోద‌య్యాయ‌ని తాజాగా ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు. త‌ద్వారా మ‌హిళ‌లు క‌ట్టాల్సిన టికెట్ రుసుము ద్వారా వారికి 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆర్థిక ల‌బ్ధి క‌లిగింద‌ని వెల్ల‌డించారు.

గ‌త ఏడాది ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లెవెలుగు, డీల‌క్స్ వంటి బ‌స్సుల్లో మ‌హిళ‌లు త‌మ ఆధార్ కార్డును చూపించి ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కైనా ఉచితంగా ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు. ప్ర‌స్తుతం అధికారిక లెక్క‌ల ప్ర‌కారం స‌గ‌టున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 24 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణాలు చేస్తున్నారు.

ఉద్యోగినులు, దైనందిన అవ‌స‌రాలు ఉన్న‌వారు.. ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేవారు.. ఇలా అవ‌స‌రం ఏదైనా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణాలు చేస్తున్నారు. దీనికిగాను ప్ర‌భుత్వం ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఆర్టీసీకి సొమ్ములు చెల్లిస్తోంది. ఈ లెక్క‌న ఏడాదికి 3000 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ప్ర‌భుత్వం స్త్రీ శ‌క్తి ప‌థ‌కానికి వెచ్చిస్తోంది. అయితే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుండ‌డంతో ఖ‌ర్చు కూడా పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న ప్ర‌భుత్వం.. ఖ‌ర్చు విష‌యంలో రాజీప‌డేది లేద‌ని పేర్కొంటోంది.

జ‌గ‌న్‌కు నిరాస‌..

2024 ఎన్నిక‌ల సమ‌యంలో టీడీపీ అధినేత‌, కూట‌మి సార‌థి చంద్ర‌బాబు.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని.. ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా ఉచితంగా ప్ర‌యాణించేలా వెసులుబాటు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌ట్లోముఖ్య‌మంత్రిగా ఉన్న‌జ‌గ‌న్‌.. ఈ హామీ ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు ప‌రిమితం అవుతార‌ని.. దీనిని సాధ్యం చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ.. ఈ హామీని ప‌ట్టుద‌ల‌గా తీసుకున్న చంద్ర‌బాబు.. గ‌త ఏడాది నుంచి సాకారం చేసి చూపిస్తున్నారు. తాజాగా ఇదిరికార్డు సృష్టించ‌డం ప‌ట్ల చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

This post was last modified on October 6, 2026 5:06 pm

Share

Recent Posts

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

19 minutes ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

4 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

4 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

5 hours ago