Movie News

ప్యారడైజ్… మళ్లీ ప్రకంపనలేనా?

తన సినిమాలను చెప్పిన బడ్జెట్లో పూర్తయ్యేలా జాగ్రత్త పడతాడని.. ప్రకటించిన డేటుకు రిలీజ్ చేస్తాడని నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ దెబ్బ తీసింది. ఈ మూవీ బడ్జెట్ చాలా పెరిగిపోయింది. అలాగే ముందులో మార్చి రిలీజ్ అనుకుని, అది కుదరక ఆగస్టుకు వాయిదా వేస్తే.. ఆ డేట్‌ను కూడా ఈ చిత్రం అందుకోలేకపోయింది. చివరికి సెప్టెంబరు 24న ‘ది ప్యారడైజ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి డేట్ మిస్ కాదనే అనుకుంటున్నారంతా.

ఐతే సినిమా లేటైనప్పటికీ.. హైప్ ఏమీ తగ్గిపోలేదు. ‘ది ప్యారడైజ్’ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. లిరిక్స్, ట్యూన్, సింగింగ్.. అన్నీ వేరే లెవెల్లో ఉండడంతో ఈ పాట విపరీతంగా వైరల్ అయింది. రిలీజైన దగ్గర్నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేయడానికి టీం రెడీ అయింది. ఈ శనివారమే సెకండ్ సింగిల్ లాంచ్‌ కాబోతోంది.

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ రెండో పాట గురించి జరుగుతున్న ప్రచారమే నిజమని తేలిపోయింది. బాగా పాపులర్ అయిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యెషనాగుల కట్ట మీద’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పెద్ద సినిమాల్లో తెలంగాణ పాట అంటే కాకర్ల శ్యామ్ లిరిక్స్ అందించడం కామన్. ఈ పాటకు కూడా ఆయనే సాహిత్యం అందిస్తున్నాడు. ‘ఆయా షేర్’ పాట పాడిన జంగిరెడ్డి.. ప్రభతో కలిసి ఈ పాటను ఆలపించాడట.

ఐతే శనివారం ఆన్ లైన్లోకి పాట రానుండగా.. అంతకంటే ముందే ప్రేక్షకుల ముందు ఈ పాటను లైవ్ పెర్ఫామ్ చేయబోతున్నాడు అనిరుధ్. శుక్రవారం జరగనున్న లైవ్ కన్సర్ట్‌లో అనిరుధ్.. హీరో నానితో కలిసి ఈ పాటను లాంచ్ చేసి పెర్ఫామ్ చేయబోతున్నాడట. ‘యెషనాగుల కట్ట మీద’ పాట ఇప్పటికే బాగా పాపులర్ కాగా.. దానికి అనిరుధ్ టచ్ ఇచ్చాడంటే అది కూడా ‘ఆయా షేర్’ స్థాయిలోనే ప్రకంపనలు రేపుతుందని భావిస్తున్నారు. ఈ పాట కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే ‘ది ప్యారడైజ్’ హైప్ ఇంకో లెవెల్‌కు చేరడం ఖాయం.

This post was last modified on August 27, 2026 10:09 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago