చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో పాటుగా తెలంగాణా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. వారంతా తమ రాష్ట్రాలకు సంబందించిన సమస్యల మీదనే ప్రసంగించారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ సమస్యలతోపాటుగా మొత్తం దక్షిణాది సమస్యలను ప్రస్థావించడమే కాకుండా కలిసి పనిచేసి అభివృద్ధి సాధిద్దాం అంటూ ప్రసంగించి ఆకట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, చెన్నై, బెంగళూరు రాజధానుల మధ్య అనుసంధానం చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు సంయుక్తంగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

రాష్ట్రాల మధ్య సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకుంటే 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతం కావచ్చని సూచించారు. నదుల అనుసంధానంపై దృష్టి సారించాలన్నారు.పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీల మిగులు వరద జలాల్ని కావేరి బేసిన్ కు తరలించే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని అమిత్ షా తో సహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఆసక్తిగా విన్నారు. సహజంగా ముఖ్యమంత్రులు ప్రాంతీయ మండలి సమావేశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం ద్వారా సొంత రాష్ట్రంలో మైలేజీ ఆశిస్తుంటారని, చంద్రబాబు మాత్రం దక్షిణాది రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా ఆలోచన చేశారని బ్యూరోక్రాట్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. L

ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి శివ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక దార్శకునిలాగా ప్రసంగించారని అభినందించారు. సీఎం విజయ్ సైతం ఆయన విజన్ గొప్పగా ఉందన్నారు.