మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ హీరోగా యజ్ఞం ఇచ్చిన బ్రేక్ కొన్నేళ్ల పాటు స్టార్ డం అనుభవించేలా చేసింది. తర్వాత వరస ఫ్లాపులు మార్కెట్ ని తగ్గించుకుంటూ వెళ్లాయి. ఆ మధ్య పక్కా కమర్షియల్, రామబాణం, భీమా, విశ్వం అంటూ ఏవేవో చేశాడు కానీ పనవ్వలేదు. తనను స్క్రీన్ మీద చూసి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. బయట ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపించడం బాగా తగ్గిపోయింది.
ముందుగా చెప్పుకోవాల్సింది ప్యాన్ ఇండియా మూవీ భరతవర్ష గురించి. సుధాకర్ చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్రాండియర్ కు ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఏడో శతాబ్దంనాటి బ్యాక్ డ్రాప్ తీసుకుని చాలా పరిశోధన చేసిన తర్వాత స్క్రిప్ట్ లాక్ చేశారు. షూటింగ్ దాదాపుగా అయిపోతుందని వినిపించిన టైంలో టీజర్ వదిలారు. రెస్పాన్స్ బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ సౌండ్ లేదు. చూస్తుంటే 2026లో రిలీజయ్యే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.
ఇదొక్కటే కాదు సింగ అని మరో సినిమాని మొన్న జూన్ లో అనౌన్స్ చేశారు. వి వెంకట్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీని అప్డేట్స్ కూడా ఆగిపోయాయి. సమస్య కేవలం చిత్రీకరణలో మాత్రమే లేదు. బడ్జెట్ పెరిగిపోవడం, ఓటిటి డీల్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం, గోపీచంద్ థియేటర్ బిజినెస్ నెంబర్లు మునుపటిలా లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు జాప్యానికి దారి తీస్తున్నాయి. ఆసక్తిని తగ్గిస్తున్నాయి.
ముందైతే గోపీచంద్ నుంచి సాలిడ్ గా ఒక బ్లాక్ బస్టర్ పడాలి. అది భరత వర్షతోనే సాధ్యమని అభిమానుల నమ్మకం. నిజానికి తన మీద ఇప్పటికీ మాస్ ఆడియన్స్ లో ఒకరకమైన గౌరవం ఉంది. సరైన కథ పడితే పైసా వసూల్ చేయిస్తాడనే నమ్మకం ఇప్పటికీ కనబరుస్తూ ఉంటారు. కాకపోతే బ్యాడ్ లక్ ఇలా ఫ్లాపులు ఇస్తూనే పోతోంది. వీలైనంత త్వరగా భరతవర్ష ప్రమోషన్లు మొదలుపెట్టి ఆ విడుదల తేదీ ఎప్పుడో అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్, మూవీ లవర్స్ కొంచెం రిలాక్స్ అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates