Political News

రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: కొండా సుష్మిత

పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పరకాల నుంచి రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయనను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అని సుష్మిత ప్రశ్నించిన వైనం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది.

గత ఎన్నికల్లో పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం కొండా మురళీ ప్రచారం చేసి గెలిపించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు కొండా మురళీ సహకరించారని, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా మురళీ సహకారం ఉందని అన్నారు.

ఆ క్రమంలోనే కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ, రేవంత్ రెడ్డికి ఈ రోజు కొండా మురళీ గుర్తుకు రావడం లేదని విమర్శించారు. బహుశా ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్లు నెత్తికెక్కాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పరకాల మైసమ్మ తల్లిపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.

తన తండ్రి కొండా మురళీ కింగ్ మేకర్ అని, తనకు భయం లేదని అన్నారు. తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ఈ రోజు చనిపోతే రేపటికి రెండు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక, 80 ఏళ్ల వయసున్న రేవూరికి రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రకటించారని విమర్శించారు. ఒకవేళ, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. రేవూరికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని విమర్శించారు.

This post was last modified on August 19, 2026 3:45 pm

Share

Recent Posts

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

51 minutes ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

5 hours ago